New Soundbar: భారీ ఫీచర్స్ తో కొత్త Dolby Audio సౌండ్ బార్ లాంచ్ చేసిన Boult బ్రాండ్.!

HIGHLIGHTS

Boult ఇండియాలో కొత్త సౌండ్ బార్ ను విడుదల చేసింది

ఈ సౌండ్ బార్ ను Dolby Audio సపోర్ట్ తో పాటు భారీ ఫీచర్స్ తో తీసుకు వచ్చింది

Boult Bassbox X500 పేరుతో కొత్త సౌండ్ బార్ ను విడుదల చేసింది

New Soundbar: భారీ ఫీచర్స్ తో కొత్త Dolby Audio సౌండ్ బార్ లాంచ్ చేసిన Boult బ్రాండ్.!

New Soundbar: ప్రముఖ ఇండియన్ కంజ్యూమర్ టెక్ బ్రాండ్ Boult ఇండియాలో కొత్త సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను Dolby Audio సపోర్ట్ తో పాటు భారీ ఫీచర్స్ తో కూడా తీసుకు వచ్చింది. బౌల్ట్ అందించిన ఈ సౌండ్ బార్ ఆకర్షణీయమైన డిజైన్ తో ఆకట్టుకోవడమే కాకుండా పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుందని కూడా బౌల్ట్ తెలిపింది. ఈ కొత్త సౌండ్ బార్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Boult New Soundbar:

బౌల్ట్ ఇండియాలో Boult Bassbox X500 పేరుతో కొత్త సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను రూ. 14,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ Flipkart నుంచి సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ ఆఫర్లు కూడా బౌల్ట్ అందించింది. ఈ బౌల్ట్ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC Bank Debit Card EMI తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,000 తగ్గింపు పొందుతారు.

Also Read: Smart Tv Deals: 8 వేల బడ్జెట్ లో లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీ డీల్స్ పై లుక్కేద్దామా.!

Boult Bassbox X500: ఫీచర్లు

బౌల్ట్ బాస్ బాక్స్ ఎక్స్ 5000 సౌండ్ బార్ 500W RMS సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ తో సినిమాటిక్ సరౌండ్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ తో డీప్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్, మూడు బూమ్ బాక్స్ స్పీకర్లు కలిగిన బార్ మరియు రెండు బూమ్ బాక్స్ స్పీకర్లు కలిగిన శాటిలైట్ స్పీకర్స్ తో వస్తుంది.

Boult launches new soundbar

ఈ సౌండ్ బార్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఇందులో USB, HDMI, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ BoomX Tech మరియు DSP టెక్ తో స్టూడియో క్వాలిటీ బాస్ మరియు లీనమయ్యే సౌండ్ అందిస్తుందని బౌల్ట్ పేర్కొంది. 90 KHz హై రెజెల్యుషన్ ఆడియో, 16 బిట్ స్టీరియో ఇంజిన్, ADC మరియు DAX తో క్రిస్టల్ క్లియర్ సౌండ్ ను ఈ సౌండ్ బార్ అందిస్తుందని కూడా బౌల్ట్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo