Price Cut: బోట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!

Updated on 07-Jan-2026
HIGHLIGHTS

బోట్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తోంది

బోట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది

ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ వివరాలు అందిస్తున్నాము

Price Cut: ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ ప్రైస్ కట్ తో బోట్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తోంది. అమెజాన్ అందించిన ప్రైస్ కట్ తో లేటెస్ట్ బోట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది. అందుకే, కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికోసం ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ వివరాలు అందిస్తున్నాము.

Price Cut: 5.2.4 Dolby Atmos సౌండ్ బార్

2025 సంవత్సరంలో బోట్ లాంచ్ చేసిన Aavante 5.2.4 Prime 6250DA సౌండ్ బార్ పై అమెజాన్ ఈ ప్రైస్ కట్ అందించింది. అమెజాన్ అందించిన ప్రైస్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 1,350 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అమెజాన్ ప్లాట్ ఫామ్ నుంచి HSBC మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను ఈరోజు కొనుగోలు చేసే యూజర్లకు ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,649 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: ఈ కొత్త Jio Plan మీకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అండ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.!

బోట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ బోట్ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో ముందు ఆరు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు, డ్యూయల్ శాటిలైట్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. మరో గొప్ప విషయం ఏమిటంటే ఈ సౌండ్ బార్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు కలిగి ఇంట్లో వైర్స్ బెడద తగ్గిస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో టోటల్ 625W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో త్రి-డైమెన్షనల్ మరియు థియేటర్ లైక్ ఆడియో అనుభవం అందిస్తుంది. అంతేకాదు, బలమైన అవుట్‌ పుట్ తో మీ సినిమా, మ్యూజిక్ మరియు గేమింగ్‌ అనుభూతిని మరింత గొప్పగా చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI eARC, USB, AUX, ఆప్టికల్, Coaxial మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :