12 గంటల బ్యాటరీ లైఫ్ మరియు పవర్ ఫుల్ సౌండ్ తో బ్లూటూత్ నేక్ బ్యాండ్ లాంచ్ చేసిన Blaupunkt

Updated on 29-Aug-2019
HIGHLIGHTS

ఇది ఒక క్వాల్కామ్ ప్రాసెరుతో మరియు 150 mAh బ్యాటరీతో వస్తుంది.

జర్మనీ బేస్డ్, ఆడియో మరియు వీడియో తయారీ ప్రముఖ సంస్థ అయినటువంటి Blaupunkt ఇండియాలో "BE -50 నెక్ బ్యాండ్" పేరుతొ ఒక సరికొత్త బ్లూటూత్ నేక్ బ్యాండ్ ని విడుదల చేసింది.   ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ అత్యధికంగా 12 గంటల వరకు నిరాంతరంగా మ్యూజిక్ ని అందిచగలదు. అంటే, కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు మీరు 12 గంటల వరకూ మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచ్చు.

BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్  : ప్రత్యేకతలు

ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒక 10mm డ్రైవర్స్ తో పాటుగా వస్తాయి. ఇది HD క్వాలిటీ మరియు  గొప్ప డెప్త్ తో Boss ని మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక క్వాల్కామ్ ప్రాసెరుతో మరియు 150 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మీకు గరిష్టంగా 12 గంటల వరకూ నిరంతరంగా మ్యూజిక్ అందించే సామర్ధ్యంతో ఉంటుంది.

అంతేకాదు, వాటర్ మరియు డస్ట్ నుండి రక్షణ కూడా ఇందులో వుంది. ఎందుకంటే, ఇది IPX5 సర్ఫిఫికేషనుతో వస్తుంది. మరింతగా ఆకుట్టుకునే విశేషం ఏమిటంటే, ఇన్ని హంగులు వున్నా ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేవలం 25గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇక ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధర విషయానికి వస్తే, ఇది రూ.1,499 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది మరియు అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందుబాటులో వుంది. ఈ ( LINK ) పైన Clik చెయ్యడంతో అమేజాన్ నుండి నేరుగా కొనవచ్చు.                 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :