కేవలం రూ. 3,000 ధరలో మంచి సౌండ్ అందించే Soundbar కావాలా .. బెస్ట్ డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

కేవలం రూ. 3,000 ధరలో మంచి సౌండ్ అందించే Soundbar

ఈరోజు రెండు జబర్దస్త్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

మినిమమ్ ధరలో మంచి సౌండ్ బార్ కోసం చూస్తుంటే ఈ సౌండ్ బార్ డీల్స్ ని చూడొచ్చు

కేవలం రూ. 3,000 ధరలో మంచి సౌండ్ అందించే Soundbar కావాలా? అయితే, నీకోసం ఈరోజు రెండు జబర్దస్త్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా చాలా చవక ధరలో లభిస్తాయి మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటాయి. చాలా మినిమమ్ ధరలో స్మార్ట్ టీవీ కి జతగా లేదా ఈ మ్యూజిక్ కోసం మంచి సౌండ్ బార్ కోసం చూస్తుంటే ఈ సౌండ్ బార్ డీల్స్ ని చూడొచ్చు.

ఏమిటా Soundbar డీల్స్?

ఈరోజు ఫ్లిప్ కార్ట్ సౌండ్ బార్స్ పై మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో రెండు లేటెస్ట్ సౌండ్ బార్ లు కేవలం రూ. 3,000 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఇందులో థాంసన్ సౌండ్ బార్ మరియు జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

Thomson Alphabeat

ఇది థాంసన్ లేటెస్ట్ గా విడుదల చేసిన 120w సౌండ్ బార్. ఈ థాంసన్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించితిన్ 86 డిస్కౌంట్ తో కేవలం రూ. 2,797 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వచ్చే సౌండ్ బార్ మరియు టోటల్ 120w సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ x లైన్ ఫుల్ స్పెక్ట్రమ్ స్పీకర్లతో వస్తుంది మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఇది మ్యాజిక్ స్పేషియల్ ఆడియో ఇంజిన్ మరియు మూడు సౌండ్ మోడ్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. అలాగే, HMDI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ZEBRONICS JUKE BAR 3903

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 57% డిస్కౌంట్ తో కేవలం రూ. 2,999 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వచ్చే బ్లూటూత్ సౌండ్ బార్ మరియు టోటల్ 120W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.

ఈ ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 వర్చువల్ ఫీచర్ తో మంచి సౌండ్ అందిస్తుంది. అలాగే, ఇది డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇందులో కూడా USB, ఆప్టికల్, HMDI Arc మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Also Read: ఆఫర్ ఈ రోజు మాత్రమే: బోల్ట్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ boltt Evo ఫస్ట్ డే స్పెషల్ ప్రైస్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది.!

ఈ రెండు సౌండ్ బార్ లు కూడా మల్టీ కనెక్టివిటీ మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ తో జతగా వచ్చే బడ్జెట్ ధరలో వచ్చే సౌండ్ బార్ డీల్స్ గా నిలుస్తాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :