best soundbar deals under deals under rs 4000 today
Soundbar Deal: నిన్న మూడు వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి వివరాలు చూశాము. ఈరోజు రూ. 4,000 బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి చూడనున్నాము. చవక ధరలో యూజర్ కోసం అవసరమైన మల్టీ కనెక్టివిటీ మరియు మంచి సౌండ్ అందించే ఫీచర్స్ కలిగి కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి ఈరోజు వివరంగా చూద్దాం.
ఈరోజు రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ 4 వేల రూపాయల ధరలో లభిస్తున్నాయి. అవేమిటంటే, Mivi Fort H160 సౌండ్ బార్ మరియు GOVO GOSURROUND 850 సౌండ్ బార్. ఈ రేడు సౌండ్ బార్స్ కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ మరియు ఆఫర్ ప్రైస్ వివరాలు ఈ ఇప్పుడు చూద్దాం.
ఇది 160W సౌండ్ అందించే మివి సౌండ్ బార్ మరియు ఇటీవల మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 85% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,799 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ రెండు బిల్ట్ స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సపోర్ట్ కలిగిన సౌండ్ బార్ మరియు నాలుగు ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, AUX, Coaxial మరియు బ్లూ టూత్ వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. ఈ మివి సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ బెస్ట్ సెల్లర్ సౌండ్ బార్ గా ఫ్లిప్ కార్ట్ ట్యాగ్ అందుకుంది.
Also Read: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.. ఎక్కడంటే.!
ఈ సౌండ్ బార్ ను కూడా ఈ ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ ధరకే సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 75% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 4,499 ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో 200W హెవీ సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఇందులో నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు 6.25 ఇంచ్ బిగ్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫార్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ HDMI Arc, Aux, USB ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 తో వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.