best powerful soundbar deal under rs 4000 budget today
4 వేల రూపాయల బడ్జెట్ లో హెవీ సౌండ్ అందించే బెస్ట్ Soundbar డీల్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. లేటెస్ట్ గా విడుదలై అమెజాన్ యూజర్స్ నుంచి మంచి రేటింగ్ మరియు రివ్యూలను అందుకున్న ప్రముఖ బ్రాండ్ సౌండ్ బార్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. 4వేల రూపాయల బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం వెతుకుతున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఒక లుక్కేయండి.
ప్రముఖ ప్రొజెక్టర్ బ్రాండ్ E GATE రీసెంట్ గా అందించిన Enigma 306 సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,490 రూపాయల ఆఫర్ రేటుకే అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్ గా అమెజాన్ యూజర్ల నుంచి మంచి రివ్యూలను మరియు 4.3 రేటింగ్ ను అందుకుంది. Buy From Here
ఈ గేట్ ఎనిగ్మా 306 సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగిన సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు డైనమిక్ స్పీకర్లు కలిగిన లాంగ్ అండ్ పవర్ ఫుల్ బార్ ఉంటుంది. ఈ సెటప్ లో 6.5 పవర్ ఫుల్ స్పీకర్ కలిగిన పెద్ద సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈ పూర్తి సెటప్ తో టోటల్ 210W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ మంచి ఆడియో ఆఫర్ చేయడానికి సరిపోతుంది. ఇది కాకుండా మంచి యాంబియన్స్ కోసం ఈ సౌండ్ బార్ లో యాంబియంట్ LED లైట్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: boAt Airdopes Prime 701: హైబ్రిడ్ ANC మరియు 50 గంటల బ్యాటరీతో లాంచ్.!
స్మార్ట్ టీవీ మరియు మ్యూజిక్ కోసం ఈ సౌండ్ బార్ తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు సింపుల్ సెటప్ తో వస్తుంది. అయితే, Dolby లేదా DTS సౌండ్ కోరుకునే వారికి ఇది తగిన ఆప్షన్ కాదని గమనించాలి. అయితే, తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ టీవీ లేదా ఇంట్లో ఆడియో ఎంజాయ్ చేయడానికి తగిన సౌండ్ బార్ అయ్యే అవకాశం ఉంది.