beats launches Beats Powerbeats Pro 2 with heart rate monitor in India
Beats Power beats Pro 2: యాపిల్ యాజమాన్యంలోని బీట్స్ ఇండియాలో కొత్త బడ్స్ ను లాంచ్ చేసింది. హార్ట్ రేట్ మోనిటర్ వంటి సూపర్ ఫీచర్స్ తో ఈ కొత్త బడ్స్ లాంచ్ చేసింది. ఈ బడ్స్ ప్రీమియం లుక్స్ తో కూడా ఆకట్టుకుంటుంది. బిల్ట్ ఫర్ అథ్లెట్స్ ట్యాగ్ లైన్ తో బీట్స్ తీసుకొచ్చిన ఈ కొత్త బడ్స్ ధర మరియు ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా.
బీట్స్ ఈ కొత్త బడ్స్ ను చాలా అందమైన డిజైన్ తో అందించింది. కేవలం అందం మాత్రమే కాదు ఈ పవర్ బీట్స్ ప్రో అల్ట్రా సెక్యూర్ ఫిట్ కోసం ఇయర్ హుక్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ANC, ట్రాన్స్పరెన్సీ మోడ్, అడాప్టివ్ ఈక్వలైజర్ మరియు డైనమిక్ హెడ్ ట్రాకింగ్ తో పర్సనలైజ్డ్ స్పెటియల్ ఆడియో ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది IPX4 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
బీట్స్ పవర్ బీట్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను రియల్ టైమ్ హార్ట్ రేట్ మోనిటరింగ్ సపోర్ట్ తో కూడా అందించింది. ఇది వర్క్ అవుట్ సమయంలో హార్ట్ రేట్ ను ఎనలైజ్ చేసి రియల్ టైమ్ డేటా కూడా అందిస్తుంది. హార్ట్ రేట్ మోనిటర్ ని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకునే ఆప్షన్ కూడా అందించింది.
ఈ బీట్స్ ఇయర్ బడ్స్ అన్ని యాపిల్ డివైజెస్ మరియు Beats app for Android తో ఆండ్రాయిడ్ ఫోన్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బీట్స్ బడ్స్ 45 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.
Also Read: iQOO Quest Days సేల్ నుంచి ఐకూ నియో 9 ప్రో డిస్కౌంట్ అందుకోండి.!
ఈ బీట్స్ బడ్స్ ను రూ. 29,900 ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ జెట్ బ్లాక్, క్విక్ సాండ్, హైపర్ పర్పల్ మరియు ఎలక్ట్రిక్ ఆరంజ్ నాలుగు కలర్ లలో లభిస్తుంది. ఈ బడ్స్ beatsbydre.com నుంచి లభిస్తుంది.