amazon offers Maha Shivaratri Deal on lg latest powerful soundbar
Maha Shivaratri Deal: మహాశివరాత్రి సందర్భంగా అమెజాన్ ఇండియా LG లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ పై లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ ప్రత్యేకమైన ఆఫర్ తో LG యొక్క పవర్ ఫుల్ వైర్లెస్ 5.1 ఛానల్ Dolby సౌండ్ బార్ ను ఈరోజు అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.
LG యొక్క 5.1 ఛానల్ సౌండ్ బార్ S65TR పై ఈరోజు గొప్ప డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ 20 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇక ఆఫర్ వివరాల్లోకి వెళితే, ఈ LG సౌండ్ బార్ ఈరోజు 39% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,988 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. అలాగే, ఈ సౌండ్ బార్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను IDFC FIRST, BOBCARD మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి కూడా రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: Jio Hotstar ఉచితంగా ఆఫర్ చేసే జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
ఈ ఎల్ జి సౌండ్ బార్ 5.1 ఛానల్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇందులో, మూడు స్పీకర్లు కలిగిన బార్, వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ LG సౌండ్ బార్ టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Audio, DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ మరియు AI Sound Pro సపోర్ట్ లతో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.