amazon offers huge deals on boAt 5.2.4 Dolby Atmos soundbar
boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కేవలం 14 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. అయితే ఈ ఆఫర్ ఈరోజు మరియు రేపు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటితో క్లోజ్ చేస్తున్నట్లు అమెజాన్ అనౌన్స్ చేసింది.
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన Aavante 5.2.4 Prime 6250DA సౌండ్ బార్ ను ఈరోజు అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 ప్రైస్ తో లిస్ట్ చేసింది. వాస్తవానికి, ఈ సౌండ్ బార్ రూ. 24,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో 2025 మధ్యలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు రూ. 9,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి లిస్ అవుట్ అయ్యింది.
అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 14,599 రూపాయల అతి చవక ధరలో మీకు ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి లభిస్తుంది. Buy From Here
Also Read: Realme GT 7 Pro పై భారీ ధర తగ్గింపు అందించిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.!
ఈ బోట్ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో, ముందు ఆరు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన మంచి సరౌండ్ బార్ ఉంటుంది. అలాగే, ఈ సెటప్ లో డ్యూయల్ సబ్ ఉఫర్ తో పాటు డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ కూడా ఉంటాయి. ఈ పూర్తి సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 625 W ఔట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ ని మీకు అందిస్తుంది. ఇది సినిమా హాల్ వంటి థ్రిల్లింగ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, ఆప్టికల్, AUX, బ్లూటూత్, USB మరియు Coaxial వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగివుంది.