ZEBRONICS 5.1 Dolby soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డీల్స్ అందుకోండి.!

Updated on 25-Aug-2025
HIGHLIGHTS

ZEBRONICS 5.1 Dolby soundbar పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది

లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు అందుబాటులో ఉన్న ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తుంది

కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు తమ లిస్ట్ లో చేర్చదగిన ఈ సౌండ్ బార్ డీల్

ZEBRONICS 5.1 Dolby soundbar పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ యొక్క లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు అందుబాటులో ఉన్న ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. ఇది 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు తమ లిస్ట్ లో చేర్చదగిన ఈ సౌండ్ బార్ డీల్. అందుకే, ఈ లేటెస్ట్ బడ్జెట్ బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను.

ZEBRONICS 5.1 Dolby soundbar డీల్ ఏమిటి?

జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ Juke Bar 9400 Pro ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ అందుకున్న సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 77% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,499 ధరలో సేల్ అవుతోంది. అలాగే, ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 849 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో జెబ్రోనిక్స్ 5.1 ఛానల్ సౌండ్ బార్ కేవలం రూ. 7,650 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

Also Read: భారీ ఆఫర్స్ తో మొదలైన Lava Play Ultra 5G మొదటి సేల్.!

ZEBRONICS 5.1 Dolby soundbar ఫీచర్స్ ఏమిటి?

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఐరన్ గ్రిల్స్ తో మంచి ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది మరియు వాల్ మౌంట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ 45 – 20000 Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తో మంచి డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది.

ఈ 5.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ డిజిటల్ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ తో ఇంటిని షేక్ చేస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :