amazon great summer sale offers huge discount on govo 5.2.4 Dolby Soundbar
జబర్దస్త్ సౌండ్ అందించే కొత్త 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ కారు చౌక ధరలో లభిస్తోంది. ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తోంది? అని వెంటనే మీకు డౌట్ రావచ్చు. ఈ సౌండ్ బార్ డీల్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి అందుబాటులో ఉంది. వాస్తవానికి, ఇది గత నెల మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు సేల్ ఆఫర్స్ తో కారు చౌక ధరలో సేల్ అవుతోంది.
గత నెల చివరిలో గోవో 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ GoSurround 1000 Pro ను ఇండియన్ మార్కెట్లో రూ. 23,999 ధరతో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు రూ. 6,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అవుట్ చేసింది. కేవలం ఒక్క నెలలో ఈ సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో సేల్ కి అందుబాటులోకి రావడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ సేల్ నుంచి అందించింది. ఈ గోవో సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఈరోజు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ గోవో డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కేవలం రూ. 16,249 రూపాయల అత్యల్ప ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Google Book తో కొత్త తరం AI ల్యాప్ టాప్ విప్లవానికి శ్రీకారం చుట్టిన గూగుల్.!
ఇది గోవో విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ మరియు గోవో ఇప్పటి అందించని కొత్త డిజైన్ లో ఈ సౌండ్ బార్ ను అందించింది. ఇది అందమైన డిజైన్ లో ఉంటుంది మరియు కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు నాలుగు స్పీకర్ మరియు పైన రెండు స్పీకర్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ 5.2.4 తో వస్తుంది.
ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్, మూవీ, న్యూస్ మరియు స్పోర్ట్స్ వంటి ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc, ఆప్టికల్, AUX, USB మరియు బ్లూటూత్ తో సహా కంప్లీట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ మరియు డిజైన్ తో పోలిస్తే, ప్రైస్ లో లభించే బెస్ట్ డీల్స్ లో ఒకటిగా చెప్పవచ్చు.