ఇండియాలో అమెజాన్ కొత్త స్మార్ట్ స్పీకర్ ను ఈరోజు విడుదల చేసింది. అదే Amazon Echo Pop స్మార్ట్ స్పీకర్ మరియు ఈ స్పీకర్ అలెక్సా మరియు బ్లూటూత్ సపోర్ట్ తో వచ్చింది. హాండ్స్ ఫ్రీ పనితనం తో వచ్చే ఈ స్మార్ట్ స్పీకర్ లక్షల కొద్ధి పాటలను నిరంతరంగా ఎంజాయ్ చెయ్యొచ్చని అమెజాన్ చెబుతోంది. అమెజాన్ తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ స్పీకర్ Echo Pop ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Echo Pop: ధర
Amazon Echo Pop ను అమెజాన్ రూ. 4,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ స్పీకర్ తో మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా జత చేసినట్లు అమెజాన్ తెలిపింది. ఈ స్పీకర్ అమెజాన్ నుండి సేల్ అవుతోంది మరియు ఈ స్మార్ట్ స్పీకర్ పైన అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ స్పీకర్ తో జతగా 9W Wipro స్మార్ట్ బల్బ్ ను జోడిగా కొంటే రూ. 649 విలువైన ఈ బల్బ్ ను 200 రూపాయలకే పొందవచ్చు.
అమెజాన్ ఎకో పాప్ స్మార్ట్ స్పీకర్ నాలుగు అందమైన కలర్ ఆపాశం లలో లభిస్తుంది. Amazon Music, Hungama, Spotify, Jio Saavn, Apple Music వంటి యాప్స్ నుండి అంధుబాటులో ఉన్న లక్షల కొద్దీ సాంగ్స్ మీరు ఎంజాయ్ చెయ్యవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ స్పీకర్ తో స్మార్ట్ AC, స్మార్ట్ టీవీ వంటి అన్ని స్మార్ట్ డివైజ్ లను కంట్రోల్ కొద చెయవచ్చు.
జస్ట్ Alexa play nursery rhyme అని చెబితే చాలు నిరవధికంగా రైమ్స్ ను వల్లిస్తుంది. ఈ స్పీకర్ ను మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీ కోసం బ్లూటూత్ స్పీకర్ గా కూడా ఉపయోంచుకోవచ్చు. ఇక సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ స్పీకర్ లౌడ్ సౌండ్ ని బ్యాలెన్స్ BASS మరియు క్రిస్పీ వోకల్స్ తో అందించ గలదని అమెజాన్ తెలిపింది.