JioMeet తమను 100 శాతం కొట్టిందంటున్న Zoom ఇండియా హెడ్

JioMeet తమను 100 శాతం కొట్టిందంటున్న Zoom ఇండియా హెడ్
HIGHLIGHTS

JioMeet పైన చట్టపరమైన చర్యలను తీసుకోవడనికి తగిన విషయాల కోసం తమ్ లీగల్ టీమ్ తో చర్చలు

ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఏమిచేయాలో లీగల్ టీం నిర్నయిస్తుందని పేర్కొన్నారు.

రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన JioMeet పూర్తిగా తమ యాప్ మాదిరిగా కనిపించడం షాక్ కు గురిచేసినట్లు, సమీర్ రాజే తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో అత్యదికంగా డౌన్ లోడ్స్ సాధించిన Zoom, ఇప్పుడు మరొక కొత్త విషయాన్ని ప్రకటించి వార్తల్లోకెక్కింది. అదేమిటంటే, భారతదేశంలో ప్రధాన టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వీడియో కాన్ఫెరెన్స్ కోసం తీసుకొచ్చినటువంటి JioMeet తమ Zoom ను 100 శాతం కొట్టిందంని, Zoom ఇండియా హెడ్ సమీర్ రాజే అవాక్కయ్యారు.                

రిలయన్స్ జియో నుండి జియో మీట్ ఉచిత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ (వీడియో కాన్ఫరెన్సింగ్) ప్రారంభించబడింది. అంతేకాదు, Zoom యాప్ మరియు గూగుల్ మీట్ లకు గట్టి పోటీనిచ్చేలా అనేకమైన ఫీచర్లతో మార్కెట్లో దీనిని ప్రవేశపెట్టారు. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని టెలికాం సంస్థ తన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను విడుదల చేసింది.

అయితే, రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో మీట్ యొక్క యూజర్ ఇంటర్ ఫేజ్ అచ్చంగా తమ Zoom యొక్క ఇంటర్ ఫేజ్ ను పోలివుందని, ఈ పోలికలను చూసి షాకైనట్లు, జూమ్ ఇండియా హెడ్ అయినటువంటి సమీర్ రాజే పేర్కొన్నట్లు, ET టెలికం రిపోర్ట్ అందించింది. ఈ నివేదిక ప్రకారం, ఎప్పటికైనాసరే తమ యాప్ కు తగిన పోటీ చేయగల యాప్స్ వచ్చే అవకాశం వుంటుందని మేము ఊహించాము మరియు నానాటికి పెరుగుతున్నసాంకేతికత వలన ఇది సాధ్యపడవచ్చు. కానీ, రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన JioMeet పూర్తిగా తమ యాప్ మాదిరిగా కనిపించడం షాక్ కు గురిచేసినట్లు, సమీర్ రాజే తెలిపారు.                            

అందుకోసమే, JioMeet పైన చట్టపరమైన చర్యలను తీసుకోవడనికి తగిన విషయాల కోసం తమ్ లీగల్ టీమ్ తో చర్చలు జరిపినట్లు మరియు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఏమిచేయాలో లీగల్ టీం నిర్నయిస్తుందని పేర్కొన్నారు. Zoom విషయానికి వస్తే, ఈ లాక్ డౌన్ సమయంలో అత్యధికంగా డౌన్లోడ్స్ సాధించిన వీడియో కాన్ఫరెన్స్ యాప్ గా నిలుస్తుంది.       

ఇక రిలయన్స్ జియోమీట్ విషయానికి వస్తే, (జియోమీట్ విసి యాప్) ప్రత్యక్ష కాల్స్ (1: 1 కాలింగ్) తో పాటు 100 మంది ఒకేసారి గుంపుగా మీటింగ్ నిర్వహించే అవకాశం అందిస్తుంది. రిలయన్స్ జియో ప్రకారం, ఈ యాప్ ఎంటర్ప్రైజ్-గ్రేడ్ హోస్ట్ నియంత్రణను అందిస్తుంది. మీరు మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడితో సైన్ అప్ చేయవచ్చు, మీరు HD క్వాలిటీ మద్దతుతో మీటింగ్స్ నిర్వహించవచ్చని, మీకు తెలియజేస్తుంది. ఈ యాప్ అందరికీ ఉచితం, ఈ యాప్ ద్వారా మీ మీటింగ్స్ అన్ని కూడా పాస్ ‌వర్డ్‌తో రక్షించబడతాయి, ఇది కాకుండా మీరు ఒకే రోజులో అపరిమిత మీటింగ్స్ కూడా నిర్వహించవచ్చు.

ఈ జియోమీట్ (జియో వీడియో కాలింగ్) నుండి మీరు నేరుగా మీ బ్రౌజర్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు. అంటే, (Chrome లేదా Firefox ఉపయోగించి), ఇది Windows, Mac, iOS మరియు Android కోసం కోసం యాప్ కూడా కలిగి ఉంది. మీరు Jio యొక్క సైట్‌లో దీనికి లింక్‌ను చూడవచ్చు.

అలాగే, HD వీడియో కాలింగ్, మంచి క్వాలిటీ ఆడియోతో మీ మీటింగ్స్ చాలా చక్కని మరియు క్లియర్ అనుభూతిని ఇస్తుంది. అటువంటి ఈ  జియో మీట్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం…     

జియో మీట్ ఎలా ఉపయోగించాలి?

  • దీని కోసం, మీరు మొదట గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా జియో మీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • దీని తరువాత మీరు అప్లికేషన్ ను తెరవాలి, ఇది మీకు లాగిన్ పేజీని చూపిస్తుంది.
  • ఇక్కడ మీరు లాగిన్ కోసం మీ ఇమెయిల్ వివరాలను ఇవ్వాలి.
  • దీని తరువాత, మీరు సైన్ అప్ కోసం మీరు OTP ద్వారా సైన్ ఇన్ చెయ్యాల్సివుంటుంది.
  • అందుకోసం, మీరు ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి మరియు దానిపై మీకు ఈ OTP లభిస్తుంది. మీరు ఈ OTP ద్వారా లాగిన్ అవ్వవచ్చు.
  • మీరు యాప్ లోపలికి చేరుకున్నప్పుడు, మీరు దీన్ని చాలా తేలికగా ఉపయోగించవచ్చు.
  • ఎందుకంటే ఈ యాప్ వినియోగదారు ఇంటర్‌ఫేస్ చాలా సులభం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo