ఈ అప్డేట్ ఫీచర్లతో మీ WHATSAPP అవుతుంది మరింత మధురంగా

ఈ అప్డేట్ ఫీచర్లతో మీ WHATSAPP అవుతుంది మరింత మధురంగా

ముందుగా, అనేకమైన సెక్యూరిటీ మరియు ప్రైవసీ పరమైన అనేక సమస్యలతో సతమమైన వాట్స్ ఆప్,  ఈ మధ్యకాలంలో తన ప్రాముఖ్యతని సుస్థిరం చేసేందుకు,  తరచూ తన వినియోగదారుల కోసం కొత్త అప్డేట్స్ లేదా క్రొత్త ఫీచర్లను అందిస్తుంది మరియు ఇవి  వినియోగదారులకు మంచి థ్రిల్‌ ని అందిస్తుంది.  2019 లో ఈ యాప్‌లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది మరియు రాబోయే కాలంలో కూడా అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ గత సంవత్సరం నుండి డార్క్ మోడ్ ఫీచర్‌పై పనిచేస్తోంది, కానీ ఇంకా ఇది విడుదల కాలేదు. అలాగే, వాట్సాప్ వినియోగదారులకు ఇలాంటి కొన్ని ఇతర ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Hide Mute స్టేటస్

వాట్సాప్ సరికొత్త ఆండ్రాయిడ్ బీటాలోఈ కొత్త ఫీచర్‌ను అందుకోనుంది, ఇది వచ్చిన తర్వాత మ్యూట్ స్టేటస్ పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ ఫీచర్ కొన్ని నెలల క్రితం డెవలప్పింగ్ లో కనిపించినప్పటికీ, ఇప్పుడు ఈ ఫీచర్ యొక్క పరీక్ష కూడా ప్రారంభమైంది. మ్యూట్ చేసిన స్టేటస్ అప్‌డేట్ ఫీడ్ తో, వాట్సాప్ స్టేటస్ విభాగంలో మ్యూట్ చేయబడిన అన్ని స్టేటస్‌లు పోతాయి మరియు మ్యూట్ స్టేటస్ మీకు కనిపించదు, అయితే ఇది ఇంకా రాలేదు, మ్యూట్ చేయబడిన స్టేటస్ అప్‌డేట్ చూడటానికి స్క్రీన్ దిగువన స్క్రోల్ చేయండంతో చేయవచ్చు.

డార్క్ మోడ్

డార్క్ మోడ్ ఫీచర్ గురించి పరిశీలిస్తే, గత కొంతకాలంగా దీని గురించిన వార్తలను వింటున్నాము మరియు ఈ ఫీచర్ Gmail, Google మరియు Chrome వంటి అనేక పెద్ద మొబైల్ యాప్స్ లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్‌లో కూడా చేర్చబోతోంది, ఇది మీ బ్యాటరీని సేవ్ చేయడానికి మంచి ఫీచర్ అని రుజువు అవుతుంది.

Self -Distracting మెసేజి

Self -Distracting మెసేజి ఫీచర్ ద్వారా, వినియోగదారులు వాట్సాప్‌లో పంపే మెసేజిలు ఎంతకాలం డుండాలో కావాల్సిన0 సమయాన్ని ఎంచుకోవచ్చు, ఆ తర్వాత ఈ సందేశాలు ఆటొమ్యాటిగ్గా తొలగించబడతాయి. ఈ వాట్సాప్ యొక్క ఈ ఫీచర్ ఇప్పటికీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని మరియు కొంతమంది వాట్సాప్ బీటా వినియోగదారులు దీన్ని గ్రూప్ చాట్‌లో ఉపయోగించవచ్చని బ్లాగ్ చూపిస్తుంది. ఈ ఫీచర్ ప్రారంభించడానికి, వినియోగదారులు గ్రూప్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా దీన్ని చేయవచ్చు. ప్రస్తుతం, వాట్సాప్ 5 సెకన్లు మరియు 1 గంట అనే రెండు ఆప్షన్లను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గ్రూప్ చాట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే, ఈ ఫీచర్ రాబోయే సమయంలో ప్రైవేట్ చాట్‌లో కూడా ఉపయోగించబడుతుందని భావిస్తున్నారు. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారు అయితే, మీరు వాట్సాప్ బీటా యొక్క 2.19.175 వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ర్యాంకింగ్

ఈ క్రొత్త లక్షణంతో, మీకు ఇష్టమైన కాంటాక్ట్స్ పైన కనిపిస్తాయి. ఈ ర్యాంకింగ్ లక్షణంతో, మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే వారితో ఆ కాంటాక్స్ట్  ఆటొమ్యాటిగ్గా  పైకి వస్తాయి.

మల్టి ప్లాట్‌ఫాం సపోర్ట్

వాట్సాప్ త్వరలో వినియోగదారుల కోసం మల్టీ -ప్లాట్‌ఫామ్ మద్దతును తెస్తుంది, ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ప్లాట్‌ఫామ్‌లలో యాప్  ఉపయోగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

బూమేరాంగ్ వీడియో

ఇన్‌స్టాగ్రామ్ యొక్క బూమేరాంగ్ ఫీచర్ యూజర్లను వీడియోలను లూప్‌లో ప్లే చేయడానికి వాట్సాప్ త్వరలో అనుమతిస్తుంది. కన్వర్ట్ టు జిఐఎఫ్ ఫీచర్‌తో వీడియో ఫీచర్ ప్యానెల్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాట్సాప్ కాల్స్

రాబోయే వాట్సాప్ ఫీచర్‌తో యూజర్లు గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo