ట్రాఫిక్స్ ఫైన్స్ నుండి మిమ్మల్ని కాపాడే స్మార్ట్ ట్రిక్స్ ఇవిగో

ట్రాఫిక్స్ ఫైన్స్ నుండి మిమ్మల్ని కాపాడే స్మార్ట్ ట్రిక్స్ ఇవిగో
HIGHLIGHTS

డ్రైవింగ్ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే, మీరు చాలా ఇబ్బందుల్లో పడవచ్చు

డ్రైవింగ్ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే, మీరు చాలా ఇబ్బందుల్లో పడవచ్చు మరియు చలాన్ కోసం ఏకంగా మీ జీతాన్ని చెల్లించాల్సి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. మీరు ఇంత భారీ జరిమానాను నివారించాలంటే కొంచెం స్మార్ట్ గా ఆలోచించాలి. ఈ రోజు మేము అలాంటి యాప్స్ గురించి మీకు చెప్తున్నాము, మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి మొదలైన ఎలక్ట్రానిక్ కాపీని మీ ఫోన్‌లో ఉంచవచ్చు. ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనలను నివారించడానికి మీరు మీ ఫోన్‌లో DigiLocker  మరియు mParivahan వంటి యాప్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

DigiLocker యాప్‌

మొదట గూగుల్ ప్లే స్టోర్ లేదా iOS యాప్ స్టోర్ నుండి మీ మొబైల్ ఫోన్‌లో డిజిలాకర్ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.

ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ వివరాలను నమోదు చేయండి మరియు OTP అందుకున్న తర్వాత ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి.

మీరు ఇప్పటికే యాప్ లో ఖాతాను తెరిచినట్లయితే, నేరుగా లాగిన్ అవ్వండి.

ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు మీ కాపీ చిత్రాన్ని IP ఇంటర్‌ఫేస్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.

MParivahan App ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి

mParivahan App అనేది ఆల్ ఇండియా RTO వాహన రిజిస్ట్రేషన్ నంబర్ సెర్చ్ యొక్క అధికారిక App. ఈ అప్లికేషన్ ఉపయోగించడానికి, మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయండి. మీరు ఈ యాప్ లో ఏదైనా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ను సెర్చ్ చెయ్యవచ్చు.

మీరు mParivahan యాప్ లో పత్రాలను సేవ్ చేయాలనుకుంటే, మొదట మీరు దానిపై రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ చేసిన తరువాత, మీరు వినియోగదారు విభాగానికి వెళ్లి సైన్ ఇన్ చేయాలి.

మీ మొబైల్ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

మీరు నమోదు చేయకపోతే, మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్  చేసి నమోదు చేయండి, ఆ తర్వాత ధృవీకరణ కోసం మీకు OTP వస్తుంది.

ఇలాంటి పత్రం యొక్క కాపీని mParivahan App లో ఉంచండి

MParivahan అనువర్తనంలో ఒక పత్రాన్ని సేవ్ చేయడానికి, మీరు MY RC విభాగానికి వెళ్లి మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయాలి.

ఇప్పుడు సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.

ఈ దశను పూర్తి చేసిన తర్వాత, వాహనం యొక్క ఇంజిన్ నంబర్ మరియు ఇన్వాయిస్ యొక్క చివరి 4 అంకెలు అడుగుతారు.

సమాచారాన్ని సబ్మిట్  చేసిన తరువాత, "Verify మరియు Get The Details " పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు మీ సమాచారాన్ని డాష్‌బోర్డ్‌లో చూస్తారు.

అదేవిధంగా, DL ను సేవ్ చేయడానికి, "My DL" విభాగానికి వెళ్లి, మీ DL నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.

ఈ విధంగా యాప్  మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను సంగ్రహిస్తుంది మరియు దాని యొక్క డిజిటల్ కాపీని సేవ్ చేస్తుంది మరియు మీరు మిమ్మల్ని తూట్లు పొడిచే చలాన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo