whatsapp web to introduce new reverse image features to identify fake photos
ఇంటర్నెట్ మొదలు కొని ఎక్కడ చూసినా ఫేక్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అయితే, నెట్టింట్లో వచ్చే ఫక్ ఫోటోలు గూగుల్ ద్వారా గుర్తించి వాటి సోర్స్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అయితే, వాట్సాప్ లో వచ్చే Fake Photos గుర్తించడానికి వీలుగా ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ ఫీచర్స్ ను తీసుకు వస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఈ అప్ కమింగ్ ఫీచర్ తో వాట్సాప్ లో సెక్యూరిటీ మరింత పెంపొందించే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ లో వచ్చే ఫోటోలు ఫేక్ అవునా కాదా అని గుర్తించడానికి ఆ ఫోటోలు సరైనదా లేక ఫేక్ ఫోటో అని చెక్ చేయడానికి సరైన అవకాశం లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా వాట్సాప్ లో వచ్చిన ఫోటోలను నేరుగా గూగుల్ లో అప్లోడ్ చేసి చెక్ చేయడానికి వీలుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్ ను అందిస్తుంది, అని వాబీటాఇన్ఫో వెల్లడించింది.
ఈ అప్ కమింగ్ ఫీచర్ ను వాట్సాప్ వెబ్ లో జత చేస్తుంది మరియు ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా టెస్టర్స్ కోసం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ తో వాట్సాప్ లో స్ప్రెడ్ అయ్యే ఫేక్ ఇమేజ్ మరియు మిస్ ఇన్ఫర్మేషన్ లను అరికట్టే వీలుంటుంది.
Also Read: ISRO PSLV-C60 SPADEX నింగికి ఎగసేది ఈరోజే: టైం మరియు లైవ్ ఎలా చూడాలో తెలుసుకోండి.!
వాట్సాప్ ఓవర్ ఫ్లో మెనూ ద్వారా ఈ ఫీచర్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్ ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దీనికోసం, ముందుగా ఇమేజ్ వ్యూవింగ్ ఇంటర్ఫేస్ లో వచ్చే మూడు చుక్కల పైన నొక్కండి. ఈ మెనూ లో రీప్లే ప్రైవేట్లీ క్రింద కొత్త ‘సెర్చ్ ఆన్ వెబ్’ ఫీచర్ దర్శనమిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ కు కావాల్సిన ఇమేజ్ ను గూగుల్ ద్వారా సోర్స్ మరియు అథెంటికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అయితే, ముందుగా ఈ ఫీచర్ ను వాట్సాప్ వెబ్ లో అందుబాటులోకి తీసుకు వస్తుంది.