Whatsapp: ఈ అప్ కమింగ్ వాట్సాప్ ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

Whatsapp యాప్ లో చాలా ఫీచర్లు త్వరలోనే జతచేయనున్నట్లు తెలుస్తోంది

కొన్ని ఫీచర్లు ఇప్పటికే టెస్టింగ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది

అప్ కమింగ్ వాట్సాప్ ఫీచర్ల పైన ఒక లుక్కేయండి

Whatsapp: ఈ అప్ కమింగ్ వాట్సాప్ ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.!

Whatsapp యాప్ లో చాలా ఫీచర్లు త్వరలోనే జతచేయనున్నట్లు తెలుస్తోంది. తన వినియోగదారులకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీ మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జత చేసే వాట్సాప్ ఇప్పుడు కూడా అదే దారిలో కొత్త ఫీచర్లను జత చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫీచర్లు ఇప్పటికే టెస్టింగ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వాట్సాప్ తీసుకు రానున్న ఆ అప్ కమింగ్ వాట్సాప్ ఫీచర్ల పైన ఒక లుక్కేయండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాటప్ లో కొత్తగా పరిచయం చైయబోతున్న ఫీచర్లలో Search messages by date, వీడియో కాల్స్ కోసం PiP మరియు వాట్సాప్ డెస్క్ టాప్ పైన Call tab వంటి మరిన్ని ఫీచర్లను తీసుకురావడానికి చూస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, డిసప్పియరింగ్ మెసేజీల పైన బుక్ మార్క్ ను గుప్పించే ఫీచర్ ను కూడా జత చేయాలనీ వాట్సాప్ యోచిస్తోంది. ఈ ఫీచర్లు కనుక వాట్సాప్ లో యాడ్ అయితే, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందుతుంది. 

అవసరమైన మెసేజ్ ను చూడవలసి వచ్చినప్పుడు కేవలం డేట్ ను ఎంచుకోవడం ద్వారా చాలా ఈజీగా మెసేజీలను పొందేందుకు ఈ  సెర్చ్ మెసేజెస్ బై డేట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే, ఇప్పటి వరకూ డెస్క్ టాప్ మోడ్ పైన లేని 'Calling Tab' ను కూడా అందిస్తుంది. వీడియో కాల్స్ కోసం PiP మోడ్ ను తీసుకు వచ్చే పనిలో ఉన్నా ఇది iPhone యూజర్ల కోసం ముందుగా అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, వాట్సాప్ వినియోగదారుల సౌకర్యార్ధం మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా యాప్ లో జత చెయ్యాలని చూస్తునట్లు తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo