WhatsApp Passkey: యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ అందించిన వాట్సాప్.!

Updated on 31-Oct-2025
HIGHLIGHTS

ఇప్పటికే యూజర్లకు గొప్ప సెక్యూరిటీ మరియు ప్రైవసీ అందిస్తున్న వాట్సాప్

ఇప్పుడు మరింత బలమైన కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ WhatsApp Passkey అందించింది

వాట్సాప్ యూజర్ల క్లౌడ్ బేస్డ్ బ్యాకప్ కూడా మరింత సెక్యూర్ అవుతుంది

WhatsApp Passkey: ఇప్పటికే గొప్ప యూజర్లకు గొప్ప సెక్యూరిటీ మరియు ప్రైవసీ అందిస్తున్న వాట్సాప్, ఇప్పుడు మరింత బలమైన కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ అందించింది. ఈ కొత్త అప్డేట్ తో పాస్ కీ ఆధారిత ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ ఆఫర్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ తో వాట్సాప్ యూజర్ల క్లౌడ్ బేస్డ్ బ్యాకప్ కూడా మరింత సెక్యూర్ అవుతుంది. వాట్సాప్ అందిస్తున్న ఈ కొత్త పాస్ కీ సెక్యూరిటీ అప్డేట్ ఏమిటో చూద్దామా.

WhatsApp Passkey: ఏమిటి ఇది?

ఇప్పటి వరకు వాట్సాప్ చాట్స్ తో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఉన్నప్పటికీ గూగుల్ డ్రైవ్ తో లేదా డ్రైవ్ వంటి క్లౌడ్ బెస్ట్ బ్యాకప్ తో పూర్తి సెక్యూరిటీ అంతంత మాత్రంగా ఉండేది. అయితే, ఇప్పుడు వాట్సాప్ తెచ్చిన కొత్త పాస్ కీ ఆధారిత ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ తో యూజర్ క్లౌడ్ బెస్ట్ బ్యాకప్ కూడా పాస్‌కీ లేదా బయోమెట్రిక్ లాక్‌తో సెక్యూర్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్ డేటా అన్ని వైపులా సురక్షితం చేయడానికి వాట్సాప్ గట్టి ప్రయత్నం చేస్తోంది.

ఈ ఫీచర్ ఎలా మీ ఫోన్ లో ఎలా సెట్ చేసుకోవాలి?

ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ని మీ ఫోన్ లో సెట్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం ముందుగా మీ ఫోన్ వాట్సాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. వాట్సాప్ సెట్టింగ్ మెనూ లోని Chats ఎంచుకోండి. తర్వాత, ‘Chat Backup’ పై నొక్కండి మరియు మీకు చాట్ బ్యాకప్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ కొత్త పేజీ లో అడుగున ‘End-to-End Encrypted Backup’ అని ఆప్షన్ ఉంటుంది, దాని పై నొక్కండి. ఒక్కడా మీకు మరో కొత్త పేజీ లో ‘Turn on’ అని ఆప్షన్ వస్తుంది దానిపై నొక్కండి. ఇక్కడ మీ వాట్సాప్ క్లౌడ్ బ్యాకప్ కోసం మీరు మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు మీ వాట్సాప్ క్లౌడ్ బ్యాకప్ కోసం పాస్ కీ తో సెక్యూర్ అవుతుంది.

అయితే, మీరు తిరిగి మీ బ్యాకప్ ని రీ స్టోర్ చేయాలనుకుంటే ఈ పాస్ కీ ని ఉపయోగించి మాత్రమే బ్యాకప్ తిరిగి తీసుకు రాగలరు. ఒకవేళ మీరు ఈ పాస్వర్డ్ మరిచిపోతే మీ వాట్సాప్ క్లౌడ్ బ్యాకప్ తిరిగి పొందలేరు. కాబట్టి, మీరు క్రియేట్ చేసే పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకోవడం చేయాలి లేదా బాగా గుర్తుంచుకోవాలి.

Also Read: Oppo Find X9 Series కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈ ఫీచర్ ఉపయోగం ఏమిటీ?

ఇప్పటి క్లౌడ్ బెస్ట్ బ్యాకప్ కేవలం సాధారణ ఎన్‌ క్రిప్షన్‌తో మాత్రమే ఉండేది. అయితే, దీనితో హ్యాకింగ్ లేదా అకౌంట్ దొంగిలించే ప్రమాదం వంటి వాటికి ఆస్కారం ఉండేది. కానీ, ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పాస్ కీ బ్యాకప్ ఫీచర్ తో చాట్ డేటా పూర్తిగా యూజర్ కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు, క్లౌడ్ సర్వీసులకు కూడా డీక్రిప్ట్ చేయలేని స్థాయిలో యూజర్ కి సెక్యూరిటీ లభిస్తుంది. కాబట్టి, యూజర్ డేటా క్లౌడ్ లో కూడా చాలా సెక్యూర్ చేయబడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :