Whatsapp నుండి Loans, ఇన్సూరెన్స్ వంటి సర్వీస్ లు మొదలుపెట్టనుంది

Whatsapp నుండి Loans, ఇన్సూరెన్స్ వంటి సర్వీస్ లు మొదలుపెట్టనుంది
HIGHLIGHTS

Whatsapp Lending సర్వీస్ అతి త్వరలోనే పార్రంభం కావచ్చు

Whatsapp Pay కూడా అతిత్వరలోనే వినియోగదారులకు అందనునట్లు తెలుస్తోంది.

త్వరలోనే Whatsapp ఇండియన్ మార్కెట్లో తన ఫైనాన్షియల్ సర్వీసు లను మొదలు పెట్టవచ్చని అర్ధమవుతోంది

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వాడుకలో వున్నా మెసేజింగ్ యాప్ అయినటువంటి Whatsapp, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ అందరికంటే ముందు నిలుస్తుంది. ఫేస్ బుక్ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రముఖ యాప్ ఇప్పుడు కొత్త సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. కేవలం చాటింగ్, కాలింగ్ మరియు మీడియా ట్రాన్స్ఫర్ వంటి మరిన్ని షోషల్ విషయాలకు వేదికగా వున్న ఈ యాప్, ఇప్పడు ఇండియాలోని ఫైనాన్షియల్ విభాగంలో తన కొత్త ఆలోచనలను అమలు చేయాలని ఆలోచిస్తోంది.

whatsapp-960.jpg

ముందుగా ఈ విషయాన్ని బిజినెస్ ఇన్ సైడర్ నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, మొదటగా Whatsapp ఇండియాలో Whatsapp Lending (రుణాలు), మైక్రో -ఇన్సూరెన్స్ మరియు మైక్రో -పెన్షన్ వంటి సర్వీస్ లను మొదలు పెట్టనునట్లు, Whatsapp ఇండియా హెడ్, అభిజిత్ బోస్ Global Fin tech Festival లో ఫైనాన్షియల్ సర్వీస్ లోకి రావడం గురించి వారి ఆలోచనలను మరియు ప్లాన్స్ కూడా షేర్ చేసినట్లు పేర్కొంది.

Telegram and whatsapp 960.jpg

అసలు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తుందో మనం చాలా సులభంగా అర్ధం చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా యొక్క గణనీయమైన అభివృధి మరియు ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా ఇన్డేలో నానాటికి తారాస్థాయికి చేరుకుంటున్న డిజిటల్ పేమెంట్స్, ఇండియాలో వ్యాపారం చేయడానికి చూసే చూసేవారికి మంచి అవకాశాలను అందిస్తోంది. ఈ విభాగంలో, ఇప్పటికే Paytm, PhonePay మరియు Amazon Pay వంటి వాటితో పాటుగా మరిన్ని మంచి ప్రగతి సాధించిన విషయం తెలిసిందే.

WhatsApp..jpg

2018 నుండి టెస్టింగ్ లో వున్న Whatsapp Pay, ఇప్పుడు అతిత్వరలోనే వినియోగదారులకు అందనునట్లు కూడా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, త్వరలోనే Whatsapp ఇండియన్ మార్కెట్లో తన ఫైనాన్షియల్ సర్వీసు లను మొదలు పెట్టవచ్చని అర్ధమవుతోంది. ఒకవేళా అదేగనుక నిజామైతే, ఇప్పటికే అన్ని స్మార్ట్ ఫోన్లల్లో పాటుకు పోయిన ఈ మెసేజింగ్ యాప్ మార్కెట్లోని ఇతర అన్ని యాప్స్ కి బయంకరమైన పోటీని ఇవ్వవచ్చు.                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo