WhatsApp closes support on these android version phones
WhatsApp యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ అనే సంబంధం లేకుండా అన్ని ఫోన్లలో ఉండే ఏక యాప్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్ చాలా సెక్యులర్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో రావడం మరియు మరింత సౌకర్యవంతంగా ఉండటం ఈ యాప్ ప్రత్యేకత. అయితే, మారుతున్న కాలంలో యాప్ అండ్ యూజర్ సేఫ్టీ ని దృష్టిలో ఉంచుకొని యాప్ అప్డేట్స్ అందిస్తుంది. అయితే, యాప్ ని పూర్తి స్థాయిలో సెక్యూర్ గా ఉంచడానికి కొత్తగా ఉంచడానికి మేజర్ అప్డేట్స్ చేయడం కూడా అవసరం అవుతుంది. అయితే, ఈ మేజర్ అప్డేట్స్ సమయంలో ఫోన్ పాత OS వెర్షన్ ఫోన్లో ఈ యాప్ ఉనికిని కోల్పోతుంది. ఇప్పుడు అలాంటి మేజర్ అప్డేట్స్ రావడంతో ఈరోజు నుంచి కొన్ని పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ యాప్ పనిచేయడం మానేస్తుంది.
వాట్సాప్ కొత్త అప్డేట్ కారణంగా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అంటే నిన్న అర్ధరాత్రి నుంచి ఆండ్రాయిడ్ 5.0 మరియు ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ తో పనిచేసే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఈ యాప్ పని చేయదు. ఈ అప్డేట్ ను వాట్సాప్ అప్డేట్ ముందుగా అందించే WABetainfo వెల్లడించింది. అంటే, ఆండ్రాయిడ్ 5.0 మరియు ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ తో పని చేసే ఫోన్ మీ వద్ద ఉంటే మీ ఫోన్ లో వాట్సాప్ పని చేయడం మానేస్తుంది. అంటే, ఆండ్రాయిడ్ 5.0 అండ్ 5,1 లాలీపాప్ వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ ఇక నుంచి పనిచేయదు.
ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ లాలీపాప్ వెర్షన్ ఫోన్ వాడుతూ మీ ఫోన్ లో వాట్సాప్ పని చేయడం మానేస్తే, మీరు మీ ఫోన్ లో ఉన్న సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ ఫోన్ ను కొత్త ఆండ్రాయిడ్ 16 os కి అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కొత్త అప్డేట్ లభిస్తే మీరు వాట్సాప్ యాక్సెస్ ని తిరిజి పొందే అవకాశం ఉంటుంది.
Also Read: iPhone 18 Pro Max లాంచ్ కంటే ముందే భారీ తగ్గింపు అందుకున్న iPhone 17 Pro Max
మీ ఫోన్ లో వాట్సాప్ యాప్ ను తెరవడం కూడా కష్టంగా ఉంటే మీరు మీ వాట్సాప్ బ్యాకప్ కోసం కొత్త ఫోన్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అంటే, కొత్త ఫోన్ లో మీ పాత వాట్సాప్ అకౌంట్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీ ఫోన్ రీసెంట్ బ్యాకప్ ను మీ కొత్త ఫోన్ లో అందుకోవచ్చు.
అయితే, ఈ వెర్షన్ ఫోన్లు చాలా తక్కువ శాతంలో మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. కాబట్టి, ఈ కొత్త అప్డేట్ తో ఎక్కువ మంది వాట్సాప్ యూజర్లు ఇబ్బంది పడే అవకాశం తక్కువగా ఉంటుంది.