WhatsApp బీటా వెర్షన్ 2.19.86 అప్డేటుతో వరుసగా వాయిస్ మెసేజిలను ప్లే చేస్తుంది

WhatsApp బీటా వెర్షన్ 2.19.86 అప్డేటుతో వరుసగా వాయిస్ మెసేజిలను ప్లే చేస్తుంది
HIGHLIGHTS

WhatsApp యొక్క కొత్త బీటా వెర్షన్ ద్వారా ఒక క్రొత్త ఫీచరును టెస్టింగ్ చేస్తోంది.

WhatsApp మెసేజి ఆప్ కి పిక్చెర్ -ఇన్ -పిక్చెర్ వీడియో ఫీచర్ను కూడా జోడించింది

నియోగదారులు అందుకునే వాయిస్ మెసేజిలను వరుసగా ప్లే చేయడానికి ఇది ఉప్పయోగపడేలా చూస్తున్నారు

స్క్రీన్ ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా వాయిస్ మెసేజిలను వినేలా అవకాశముంటుంది.

సుప్రసిద్ధ మొబైల్ మెసేజింగ్ ఆప్ అయినటువంటి, WhatsApp యొక్క కొత్త బీటా వెర్షన్ ద్వారా ఒక  క్రొత్త ఫీచరును టెస్టింగ్ చేస్తోంది. అదేమిటంటే,  వినియోగదారులు అందుకునే వాయిస్ మెసేజిలను వరుసగా ప్లే చేయడానికి ఇది ఉప్పయోగపడేలా చూస్తున్నారు. వాస్తవానికి,  WABetaInfo ద్వారా నివేదించబడిన, ఈ కొత్త ఫీచర్ WhatsApp వర్షన్ 2.19.86+ నుండి కనుగొనబడింది మరియు ఇది ఒకేసారి చాలామంది నుండి అందుకున్న వాయిస్ మెసేజిలను ఆటోమేటిగ్గా ప్లే చేస్తుంది. అదనంగా, వాట్స్అప్ ఫార్వార్డ్ చేయబడిన వీడియోల కోసం ఒక మెరుగైన పిక్చర్ -ఇన్ -పిక్చర్ కోసం కూడా పని చేస్తుంది.

WhatsApp PIP 2.jpg

మా WhatsApp బీటా (ver 2.19.87) లో, ఈ కొత్త ఫీచర్ల గురించి ఊహించిన విధంగా పని చేస్తునట్లు తెలుస్తోంది. మీరు కూడా ఈ తాజా WhatsApp బీటాలో ఉన్నట్లయితే, ఎవరైనా మీకు వాయిస్ సందేశాలను పంపినప్పుడు, కనీసం రెండురేసుకు తక్కువకాకుండా పంపినప్పుడు మీరు దాన్ని ఆటోమేటిగ్గా  ప్లే చేయడాన్ని చూడగలరు. మొట్టమొదటి వాయిస్ మెసేజ్లో ప్లే అవుతుండగా, మిగిలినవి ప్లే క్యూ లో ఉండడాన్ని చూడవచ్చు. అలాగే, ఒక వాయిస్ మెసేజిముగిసి మరొకటి  ప్లే అయ్యే ముందు మీకు ఇండికేషన్ కూడా అందిచబడుతుంది. ఈ ఆప్ అందుకున్న మొత్తం వాయిస్ మెసేజిలను ప్లే చేయడం పూర్తి అయ్యిందని, మీకు తెలియచేసే  ఒక ప్రత్యేకమైన నోటిఫిక్షన్ సౌండ్ కూడా అందించింది.

WhatsApp మెసేజి ఆప్ కి పిక్చెర్ -ఇన్ -పిక్చెర్ వీడియో ఫీచర్ను కూడా జోడించింది, చాట్ చేయడం కొనసాగుతున్నప్పుడు, చాట్ స్క్రీన్లో ఒక చిన్న విండోలో వినియోగదారులు ఫార్వార్డ్ చేసిన వీడియోను చూడటానికి ఇది అనుమతిస్తుంది. కానీ వినియోగదారు ప్రధాన స్క్రీనుకు లేదా మరొక చాట్ స్క్రీనుకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ వీడియోను ప్లే కంటిన్యూ చేయబడదు. అయితే, WhatsApp బీటా ver. 2.19.86 దీన్ని కూడా అనుమతించే ఫీచర్ యొక్క మెరుగైన వెర్షన్ తో వస్తుంది.

WhatsApp ఇప్పుడు నిరంతరంగా బీటా వెర్షన్ లో కొత్త ఫీచర్లను పరీక్షిస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ మరొక లక్షణాలలో ఒకటి బయోమెట్రిక్ అతంటికేషన్ ఫీచర్, ఇది వినియోగదారుల యొక్క ప్రైవసీని పూర్తిగా రక్షించడంలో సహాయపడుతుంది. Android కోసం WhatsApp యొక్క స్థిరమైన బిల్డ్ లో, బయోమెట్రిక్ అతంటికేషన్ ఫీచర్ ద్వారా, లాక్ చేసిన WhatsApp ఆప్ ను, ఫోన్ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ తో టచ్ ID లేని ఐఫోన్లలో ఫేస్ ID ని ఉపయోగించి, అన్లాక్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo