Whatsapp నుండి వాలంటైన్స్ డే కానుక…

Whatsapp నుండి వాలంటైన్స్ డే కానుక…
HIGHLIGHTS

ఈ వాలంటైన్స్ డే సందర్భంగా వాట్సాప్ మీకు ఈ అవకాశాన్ని అందించింది

మెసేజి & చాటింగ్ కోసం ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే అప్లికేషన్ గా పేరుపొందిన వాట్సాప్ ఈ వాలంటైన్స్ డే ని పురస్కరించుకొని ఒక ఫీచరును అందించింది. మనకు ఇష్టమైనవారు, సన్నిహితులు, క్లాస్ మేట్స్ మరియు ఒకరేమిటి ఈ ప్రపంచంలో మనకు తెలిసినవారు ఎక్కడ ఉన్నా వారిని మన దగ్గరే ఉన్నట్లు తలపింప చేసే శక్తి ఈ ఆప్లికేషన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. చాటింగ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ మరియు మీడియా షేరింగ్ వంటి ఫీచర్లతో మనకు సహాయపడుతుంది.

ఈ రోజు వాలంటైన్స్ డే సందర్భంగా ఒక కొత్త ఫీచర్ను వాట్సాప్ ప్రకటించింది. అదేమిటంటే, మీరు ఇప్పటి వరకూ మీకు నచ్చినవారికి లేదా కుటుంభ సభ్యులకు లేదా ఇతరులకు చాలా మెసేజిలు, చాటింగ్ లేదా మీడియా ఫైళ్లను పంపడం వంటివి చేసుంటారు. కానీ, మీరు ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా ఎవరితో ఎక్కువగా మెసేజిలు, ఫోటోలు, GIF, వీడియో మరియు వాయిస్ కాల్స్ మీరు ఎక్స్చేంజి చేశారో అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసారా?. అందుకే, ఈ వాలంటైన్స్ డే సందర్భంగా మీకు ఈ అవకాశాన్ని అందించింది వాట్సాప్. ఇది ఎలాగ చేయాలో క్రింద చూడవచ్చు.

మీరు ఎన్ని మెసేజిలు, ఫోటోలు, GIF, వీడియో మరియు వాయిస్ కాల్స్ మీరు ఎక్స్చేంజి చేశారో తెలుసుకోండి.

1. వాట్సాప్ ని ఓపెన్ చెయ్యండి

2. అందులో పైన కుడివైపున వున్నా మూడుచుక్కలను నొక్కి సెట్టింగ్స్ ఎంచుకోండి

3. ఇందులో 'డేటా మరియు స్టోరేజి యూసేజి' ని ఎంచుకోండి

4. చివరిగా 'స్టోరేజి యూసేజి'

దీనిని ఎంచుకున్న వెంటనే, మీకు మీ వాట్సాప్ కాంటాక్ట్స్ లోని అన్ని వివరాలు మీకు కనిపిస్తాయి. ఇందులో, అన్ని గ్రూప్స్, అన్ని కాంటాక్ట్స్ యొక్క పూర్తి వివరాలను మీరు చూడవచ్చు. ఇక్కడ కనిపించిన మీకు కావాల్సిన కాంటాక్ట్ పైన నొక్కడంతో, మీరు ఎన్ని మెసేజిలు, ఫోటోలు, GIF, వీడియో మరియు వాయిస్ కాల్స్ మీరు ఎక్స్చేంజి చేశారో విడివిడిగా నంబర్ మరియు సైజుతో సహా కనిపిస్తుంది. 

అంతేకాదు, ఒకవేళ మీకు అంతగా ఉపయోగంలేని కాంటాక్ట్ కి పంపిన లేదా రిసీవ్ చేసుకున్న మెసేజిలు, ఫోటోలు, GIF, వీడియో మరియు వాయిస్ కాల్స్ వంటి వాటికి సంభందించిన లోకల్ స్టోరేజిని డిలీట్ కూడా చేసుకోవచ్చు.                                              

ఇప్పటి వరకూ యెంత డేటా వాడారో తేకలుసుకోవడం ఎలా? 

1. వాట్సాప్ ని ఓపెన్ చెయ్యండి

2. అందులో పైన కుడివైపున వున్నా మూడుచుక్కలను నొక్కి సెట్టింగ్స్ ఎంచుకోండి

3. ఇందులో 'డేటా మరియు స్టోరేజి యూసేజి' ని ఎంచుకోండి

4. చివరిగా 'నెట్వర్క్ యూసేజి' ని ఎంచుకోండి

దీనిని ఎంచుకున్న వెంటనే, మీకు మీ వాట్సాప్ కోసం మీరు ఇప్పటి వరకూ వాడిన డేటా యూసేజి కి సంభందించి అన్ని వివరాలు మీకు కనిపిస్తాయి. ఇందులో, మీరు వాట్సాప్ నుండి యెంత పరిమాణము గల డేటాని ఏ మెసేజిలు, ఫోటోలు, GIF, వీడియో మరియు వాయిస్ కాల్స్ కోసం మీరు ఖర్చు చేశారో సైజుతో సహా కనిపిస్తుంది.                                                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo