Diwali 2022: వినియోగదారుల కోసం కొత్త పండుగ స్టిక్కర్స్ జత చేసిన వాట్సాప్.!

Diwali 2022: వినియోగదారుల కోసం కొత్త పండుగ స్టిక్కర్స్ జత చేసిన వాట్సాప్.!
HIGHLIGHTS

Diwali 2022 పండుగ స్టిక్కర్స్ జత చేసిన వాట్సాప్

దేశవాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి

శుభాకాంక్షలు తెలుపడానికి కొత్త స్టిక్కర్లను వాట్సాప్ యాప్ లో జత చేసింది

Diwali 2022: వినియోగదారుల కోసం కొత్త పండుగ స్టిక్కర్స్ జత చేసిన వాట్సాప్. దేశవాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. అందుకే, ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇష్టమైన వారికి తమ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకోవడానికి వాట్సాప్ కొత్త స్టిక్కర్లను వాట్సాప్ యాప్ లో జత చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా యూజర్లను చోరగొన్న వాట్సాప్, తన వినియోగదారులకు కొత్త తరహాలో ఫన్ ను యాడ్ చేసే యాప్ గా కూడా నిలుస్తుంది. ఇప్పుడు వాట్సాప్ లో వచ్చిన కొత్త స్టిక్కర్లతో మీకు నచ్చిన వారికి మీ దీపావళి శుభాకాంక్షలు ఇన్స్టాంట్ గా తెలియచేయవచ్చు.

వాట్సాప్ కొత్తగా అందించిన స్టిక్కర్ల మరియు GIF లను చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు. మరి వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త స్టికర్లు మరియు GIF లను ఎలా పొందవచ్చో మరియు వాటిని మీకు ఇష్టమైన వారికి ఎలా పంపవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మీరు ఎటువంటి తర్డ్ పార్టీ యాప్ ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు మరియు వాట్సాప్ లోనే వీటిని పొందుతారు.

దీనికోసం మీరు చేయవలసిందల్లా WhatsApp ఓపెన్ చేసి మీరు స్టికర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటున్న వారి చాట్ ను తెరవండి. తరువాత, Search సింబల్ పైన నొక్కి ఆపైన దీపావళి అని టైప్ చేయండి. ఇక్కడ మీకు దీపావళి కోసం వాట్సాప్ స్టికర్లు కనిపిస్తాయి. ఒకవేళ మీరు మరిన్ని స్టికర్లు కోరుకుంటే, ప్రాంప్ట్‌ పైన క్లిక్ చేసినట్లయితే సుమౌలీ దత్తా ద్వారా అందిచబడిన హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్‌ను పొందుతారు. ఇక్కడ నుండి మీకు నచ్చిన స్టికర్ ను డౌన్ లోడ్ అప్షన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతే, మీకు నచ్చిన స్టిక్కర్ ను డౌన్ లోడ్ చేసుకొని మీకు ఇష్టమైన వారికి పంపించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo