e Aadhaar App: ఆధార్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం సింగిల్ యాప్.!

Updated on 04-Nov-2025
HIGHLIGHTS

ప్రభుత్వం ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ యాప్ అందించే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది

ఆధార్ అప్డేట్ చేసేందుకు వీలుగా కొత్త సూపర్ యాప్ తీసుకురావడానికి పని చేస్తున్నట్లు చెబుతన్నారు

m ఆధార్ తో పోలిస్తే , ఈ అప్ కమింగ్ యాప్ లో మరిన్ని ఫీచర్స్ ఉంటాయని కూడా చెబుతున్నారు

e Aadhaar App: దేశంలో ప్రధాన ప్రమాణ పాత్రంగా కొనసాగుతున్న ఆధార్ కోసం అనేక అప్‌డేట్స్ మరియు ఫీచర్స్ అందించిన ప్రభుత్వం ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ యాప్ అందించే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ ప్రోసెస్ ని మరింత సులభం చేసిన UIDAI మరింత సులభంగా ఆధార్ అప్‌డేట్ చేసేందుకు వీలుగా కొత్త సూపర్ యాప్ తీసుకురావడానికి పని చేస్తున్నట్లు చెబుతన్నారు. ఇప్పుడు కొనసాగుతున్న m ఆధార్ తో పోలిస్తే , ఈ అప్ కమింగ్ యాప్ లో మరిన్ని ఫీచర్స్ ఉంటాయని కూడా చెబుతున్నారు.

e Aadhaar App:

ఆధార్ సర్వీస్ లను మరింత సులభతరం చేయడానికి UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) రూపొందిస్తున్న సరికొత్త యాప్ ఈ ఆధార్ యాప్. ఈ కొత్త యాప్ తో ఆధార్ కార్డు కలిగిన వారు సొంతంగా ఆధార్ కి సంబంధించిన అప్డేట్స్ ను నిర్వహించడానికి వీలువుతుంది. అంటే, డెమోగ్రాఫిక్ వివరాలైన పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మరియు అడ్రస్ వంటి అని వివరాలు యూజర్లు నేరుగా ఈ యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ప్రసుతం ప్రభుత్వం అందించిన m ఆధార్ యాప్ తో పోలిస్తే ఇది మరింత అడ్వాన్స్ గా ఉంటుంది మరియు ఎక్కువ ఫీచర్స్ కలిగి వుండే అవకాశం ఉంటుంది. ఈ అప్ కమింగ్ యాప్ లో సెక్యూరిటీ కోసం యాప్‌లో ఫేస్ రికాగ్నిజెషన్ మరియు QR కోడ్ స్కాన్ వంటి టెక్నాలజీలు ఉపయోగించబడతాయి. అంతేకాదు, యూజర్ డేటా ప్రైవసీ కాపాడేందుకు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది.

Also Read: రూ. 4,788 రూపాయల విలువైన వన్ ఇయర్ Chat GPT Go ఉచితంగా అందుకోండి.!

e Aadhaar App: ఎప్పుడు వస్తుంది?

ఈ ఆధార్ యాప్ లాంచ్ గురించి ప్రస్తుతం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. అయితే, 2025 చివరి నాటికి ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజం అయితే డిసెంబర్ చివరి నరికి ఈ యాప్ అందుబాటులోకి రావచ్చు.

ఇక భద్రత విషయానికి వస్తే, ఈ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తుంది. అంతేకాదు, ఇందులో ఉన్న QR కోడ్ మరియు Face ID వెరిఫికేషన్ భద్రతల వల్ల మీ ఆధార్ ని ఇతరులు దుర్వినియోగం చేయడం సాధ్యం అవుతుంది. అలాగే, OTP ఆధారిత వెరిఫికేషన్ తో మీ డేటా చాలా సురక్షితంగా ఉంటుంది.

ఇక ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ సర్వీస్ ను మరింత ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్లడానికి UIDAI యోచిస్తోంది. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్ సెంటర్స్ మరియు ఆధార్ కేంద్రాలు సందర్శించాల్సిన పని కూడా ఉండదు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సూపర్ యాప్, ప్రతి భారతీయుడికి ఆధార్ అనుభవాన్ని మరింత సులభతరం చేయనుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :