రూ. 4,788 రూపాయల విలువైన వన్ ఇయర్ Chat GPT Go ఉచితంగా అందుకోండి.!

HIGHLIGHTS

Open AI ఇండియన్ యూజర్ల కోసం ఉచిత ఆఫర్ అనౌన్స్ చేసింది

మిటెడ్ యాక్సెస్ తో ఉన్న చాట్ జిపిటి కోసం కొత్త ప్లాన్స్ అందించింది

రూ. 4,788 రూపాయల విలువైన వన్ ఇయర్ Chat GPT Go సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది

రూ. 4,788 రూపాయల విలువైన వన్ ఇయర్ Chat GPT Go ఉచితంగా అందుకోండి.!

Open AI ఇండియన్ యూజర్ల కోసం ఉచిత ఆఫర్ అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు లిమిటెడ్ యాక్సెస్ తో ఉన్న చాట్ జిపిటి కోసం కొత్త ప్లాన్స్ అందించింది. ఇందులో Chat GPT Go ప్రీమియం ప్లాన్ ను భారతీయ యూజర్ల కోసం ఉచితంగా అనౌన్స్ చేసింది. వాస్తవానికి, ఇండియాలో రూ. 399 రూపాయల గో ప్లాన్ తెచ్చిన సందర్భంగా ఈ కొత్త ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ ప్రీమియం ప్లాన్ కోసం నెలకు రూ. 399 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ ప్లాన్ యొక్క రూ. 4,788 రూపాయల విలువైన వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Chat GPT Go ఉచిత ఆఫర్ ఏమిటీ?

ఓపెన్ ఎఐ ఇప్పటి వరకు లిమిటెడ్ యాక్సెస్ తో ఉచిత యాక్సెస్ మరియు నెలకు రూ. 1,999 చెల్లించే ప్లస్ ప్లాన్ తో పాటు నెలకు రూ. 19,900 చెల్లించే ప్రో ప్లాన్స్ మాత్రమే అందించింది. అయితే, ఇప్పుడు ఇండియన్ బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసి కొత్త రూ. 399 రూపాయల చాట్ జిపిటి గో బడ్జెట్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కూడా అందించింది.

ఈ ప్లాన్ ని లాంచ్ చేసిన సందర్భంగా యూజర్లకు రూ. 4,788 రూపాయల విలువైన 12 నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ ఆఫర్ ని కూడా అనౌన్స్ చేసింది. అంటే, ఎటువంటి ఖర్చు లేకుండా నెలకు రూ. 399 విలువైన చాట్ చాట్ జిపిటి గో యాక్సెస్ ని పూర్తిగా సంవత్సరం అందించవచ్చు. అయితే, సంవత్సరం ఉచిత యాక్సెస్ ముగిసిన తర్వాత నెలకు రూ. 399 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది, ఒకవేళ ఈ సబ్ స్క్రిప్షన్ వద్దనుకుంటే ఆటో డెబిట్ ఆప్షన్ ను క్యాన్సిల్ చేయడం ద్వారా ప్లాన్ నుంచి నిష్క్రమించవచ్చు.

Also Read: Price Cut: లేటెస్ట్ 5.2 Dolby సౌండ్ బార్ పై భారీ తగ్గింపు అందించిన కంపెనీ.!

Chat GPT Go లాభాలు ఏమిటి?

ఈ కొత్త బడ్జెట్ ప్లాన్ తో GPT-5 కి పూర్తి యాక్సెస్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు మెసేజింగ్ మరియు అప్లోడ్ లిమిట్ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇమేజ్ కోసం ఫ్రీ వెర్షన్ లో తీసుకునే టైమ్ తో పోలిస్తే చాలా వేగంగా ఇంజె ను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాదు, Projects, tasks మరియు custom GPTs కి కూడా యాక్సెస్ అందిస్తుంది. ఈ కొత్త ప్లాన్ ఈరోజు నుంచి ఇండియాలో అందుబాటులో వచ్చింది మరియు మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఇది ఇండియన్ చాట్ జిపిజి యూజర్ల కోసం కోసం Open AI అందించిన ప్రత్యేకమైన ఆఫర్ మరియు ఇది యూజర్స్ అందరికీ అందుబాటులో ఉంది. మీరు కూడా ఈ ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందాలనుకుంటే చాట్ జిపిటి యాప్ లేదా సైట్ ద్వారా మీ అకౌంట్ ను ప్రీమియం కి కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం, మీ బ్యాంక్ అకౌంట్ లేదా UPI యాప్స్ తో ఆటో డెబిట్ ఆప్షన్ ని సెట్ చేయాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo