గత కొంతకాలంగా, Instagram టిక్‌టాక్-ప్రత్యామ్నాయ యాప్ గా Reels అనే పిలిచే యాప్ ని మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో ఉంది.
ఈ ఇన్-యాప్ ఫీచర్ గత సంవత్సరం వరకూ బ్రెజిల్‌లో పరీక్షించబడింది.
Reels, TikTok యొక్క స్థానాన్నిపూరించడానికి ప్రయత్నించడమే కాకుండా, Chingari, Roposo మరియు Mitron వంటి స్వదేశీ చిన్న వీడియో యాప్స్ తో కూడా ఇది పోటీపడుతుంది.
గత కొంతకాలంగా, Instagram టిక్‌టాక్-ప్రత్యామ్నాయ యాప్ గా Reels అనే పిలిచే యాప్ ని మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ ఇన్-యాప్ ఫీచర్ గత సంవత్సరం వరకూ బ్రెజిల్‌లో పరీక్షించబడింది. అయితే, ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం TikTok తో చాలా చైనీస్ యాప్స్ ని ఇండియాలో బ్యాన్ చేయడం వలన, ఇదే అదునుగా భావించిన కంపెనీ, ఇండియాలో విస్తృతంగా పైలట్ టెస్ట్ చేయాలని యోచిస్తోంది. టిక్‌టాక్‌తో పాటు మరో 58 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తరువాత, ఈ ప్రయత్నాలలో వేగం పుజుకుంది.
Survey
✅ Thank you for completing the survey!
Reels, సుప్రసిద్ధ చిన్న వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ TikTok యొక్క స్థానాన్నిపూరించడానికి ప్రయత్నించడమే కాకుండా, Chingari, Roposo మరియు Mitron వంటి స్వదేశీ చిన్న వీడియో యాప్స్ తో కూడా ఇది పోటీపడుతుంది.
నివేదికల ప్రకారం, జూలై 8, బుధవారం సాయంత్రం 7:30 నుండి భారతదేశంలోని వినియోగదారులకు Reels ఫీచర్‌ను విడుదల చేయాలని ఇన్‌స్టాగ్రామ్ యోచిస్తోంది. ఈ ఫీచర్‌లో ఆర్జే అభినవ్, కుషా కపిలా, రాధిక బంగియా, అమ్మి విర్క్ వంటి ఇంటర్నెట్ వైరల్ స్టార్స్ మరియు ఇంకా చాలా మంది కూడా ఉంటారు.
Instagram Reels ఎలా పని చేస్తుంది?
Reels ఫీచర్ ని ఉపయోగించి, వినియోగదారులు చిన్న, అంటే 15-సెకన్ల వీడియోలను సృష్టించగలుగుతారు. దీనిలో వారు సంగీతం లేదా ఇతర ఆడియోలతో Lip-sync చేయవచ్చు. వినియోగదారులు, ఇతర అకౌంట్స్ నుండి ఇప్పటికే ఉన్న క్లిప్స్ నుండి ఆడియోను రీమిక్స్ చేయవచ్చు. వినియోగదారులు వీడియో వేగాన్ని సర్దుబాటు చేయగల మరియు కౌంట్‌డౌన్ టైమర్‌ను జోడించగల అవకాశంతో పాటుగా మరెన్నో చేయగల ఎడిటింగ్ విభాగాన్ని రీల్స్ కలిగి ఉంటుంది.
మీరు Instagram Reels ఎక్కడ చూడవచ్చు?
ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో Reels కనిపిస్తుంది, ఇది క్రియేటర్స్ ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ఎలా క్రియేట్ చేశారో, అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ లోని కెమెరా బటన్ నుండి కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. అకౌంట్ పేరు ద్వారా సెర్చ్ చెయ్యడమే కాకుండా, మ్యూజిక్ ట్రాక్‌లను ఉపయోగించి Reel Creators ను కూడా సెర్చ్ చెయ్యవచ్చు. హ్యాష్‌ట్యాగ్, AR ఎఫెక్ట్ లేదా మ్యూజిక్ ట్రాక్ ద్వారా Search చేస్తున్నప్పుడు కూడా రీల్స్ కనిపిస్తుంది.