TikTok ‘రెమిడీ’ రెండు కుటుంబాలను ఆసుపత్రి పాలు చేసింది

TikTok ‘రెమిడీ’ రెండు కుటుంబాలను ఆసుపత్రి పాలు చేసింది
HIGHLIGHTS

ఈ వీడియో, రెండు కుటుంబాలకు చెందిన 10 మందిని ఆసుపత్రి పాలు చేసింది.

కరోనావైరస్ అంటే ఆషామాషీ కాదు ఇది చాలా పెద్ద విషయం. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ లేనందున, దీని గురించి చేసే అసత్య ప్రచారాలు పరిస్థితిని మరింత దిగజార్చడానికి కారణం అవుతాయి. నివారణ లేకపోవడం వలన తెలిసీతెలియని వారు చేసిన తప్పుడు సమాచారం, ఈ మహమ్మారి మరింతగా వ్యాప్తి చెందడానికి దారితీసింది, ముఖ్యంగా హోమ్ రెమిడీస్ నివారణలకు సంబంధించి. టిక్‌టాక్‌ లో చెక్కర్లు కొడుతున్న  ఒక కొత్త వీడియో “డాతురా స్ట్రామోనియం విత్తనాలతో చేసిన రసం తాగడం” అర్ధమయ్యేలా చెప్పాలంటే "ఉమ్మెత్త గింజలతో చేసిన రసాన్ని తాగితే "వైరస్‌ను దూరంగా ఉంచుతుంది. ఈ వీడియో, రెండు కుటుంబాలకు చెందిన 10 మందిని  ఆసుపత్రి పాలు చేసింది.

కరోనా వైరస్ ను పరిష్కరించడానికి వివిధ గృహ నివారణల(హోమ్ రెమిడీస్)  గురించి వీడియోలు షర్ అవుతున్నాయి. కానీ, అటువంటి వాటి భారిన పడకుండా వాటికీ చాలా దూరంగా ఉండమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. వాస్తవానికి, సోషల్ మీడియా యాప్స్ ద్వారా కొంత మంది ప్రజలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం చెబుతోంది. వాట్సాప్, దాని ఇటువంటి వాటిని నియంత్రించడంలో కొన్ని చర్యలను తీసుకుంది. ఇటీవల మీరు ఫార్వార్డ్ చేసే మెసేజిలను పరిమితం చేసింది. అయినప్పటికీ, అప్పుడప్పుడు వాట్సాప్ ఫార్వర్డ్ రూపంలో వ్యాప్తి చెందే తప్పుడు సమాచారం ఆపలేకపోతోంది.

ఇక విహాస్యానికి వస్తే, చిత్తూరు జిల్లాలోని ఆలపల్లి అనే మారుమూల గ్రామంలోని రెండు కుటుంబాలు ప్రభుత్వ హెచ్చరికను పెడచెవినపెట్టి, ఆన్లైన్లో షేర్ అయినా వీడియోను చూసి, ఉమ్మెత్త గింజలతో చేసిన రసాన్ని తాగారు. ఈ మొక్కను ఇంగ్లీషులో జిమ్సన్వీడ్ అని కూడా పిలుస్తారు మరియు ఇది నైట్ షేడ్ కుటుంబానికి చెందినది. నిజానికి, ఈ మొక్క యొక్క అన్ని భాగాలలో వివిధ పరిమాణాలలో విషపూరితంగా వుంటుంది. ఉమ్మెత్త గింజలతో చేసిన రసాన్నిత్రాగిన  ఈ కుటుంబ సభ్యులను వారి పొరుగువారు స్పృహలోకోల్పయినట్లు గుర్తించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారికి చికిత్స చేసి తరువాత డిశ్చార్జ్ చేశారు.

నివారణ లేదా వ్యాక్సిన్ లేని ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నసమయాల్లో, వైద్య నిపుణుల మాటల పైన మాత్రమే శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ప్రస్తుతం రెండు సంభావ్య టీకాలు ట్రయల్ దశలో ఉన్నాయి, వాటిలో ఒకటి బిల్ మరియు మెలిండా గేట్స్ మద్దతుతో ఉంది. అదనంగా, పరిశోధకులు వైరస్ పైన సంభావ్య సైట్లను గుర్తించడానికి కంప్యుటేషనల్ కెమిస్ట్రీని ఉపయోగిస్తున్నారు, అక్కడ వారు వైరస్ హానిచేయని రసాయన ఏజెంట్లతో బంధించవచ్చు. ప్రస్తుతానికి, మనం నివారణ మరియు టీకా వంటివి లేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో మెరుగ్గా పనిచేసే మందులు ఉన్నప్పటికీ, ఇవి 100 శాతం కేసులలో వాటి సామర్థ్యం చూపించడం లేదు. కాబట్టి, అపోహలు నమ్మకుండా ప్రభుత్వం చెబుతున్న సూచనలు పాటించడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo