ఇండియన్ ఇంటెలిజెన్స్ భారతీయుల డేటా భద్రతకు ముప్పుగా భావిస్తున్న 52 Chinese Mobile Apps ఇవే

ఇండియన్ ఇంటెలిజెన్స్ భారతీయుల డేటా భద్రతకు ముప్పుగా భావిస్తున్న 52 Chinese Mobile Apps ఇవే
HIGHLIGHTS

ఈ Chinese Mobile Apps ను బ్లాక్ చేయాలని లేదా ఈ యాప్‌లను ఉపయోగించవద్దని భారతీయులకు సూచించాలని Indian Intelligence Agencies ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

ఈ 52 Mobile Apps కొన్ని చైనాలో తయారవ్వగా, మరికొన్ని చైనాతో సంభంధాలను కలిగివున్నాయి.

ఈ యాప్స్ దేశం నుండి భారతీయుల డేటాను పెద్ద ఎత్తున చేరవేస్తునట్లు తెలిపాయి.

భారత్, చైనా మధ్య చెలరేగిన సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేవలం, బోర్డర్ లోనే కాదు  భారతీయుల డేటా కూడా చిక్కులో పడేఅవకాశం ఉందని, భారత నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి మరియు  భారత భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. దీని మీద దృష్టిసారించిన భారత భద్రతా సంస్థలు, ఇలాంటి సమస్యల వాటిల్లే అనుమానమున్న 52 యాప్‌లను గుర్తించాయి. ఇది దేశ భద్రతకు ముప్పు అని ఒక నివేదిక వెల్లడించింది. ఈ 52 Mobile Apps అన్నికూడా చైనాతో సంభంధాలను కలిగివున్నవే.కొన్ని చైనాలో తయారవ్వగా, మరికొన్ని చైనాతో సంభంధాలను కలిగివున్నాయి. ఈ Chinese Mobile Apps ను బ్లాక్ చేయాలని లేదా ఈ యాప్‌లను ఉపయోగించవద్దని భారతీయులకు సూచించాలని Indian Intelligence Agencies ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ 52 Chinese Mobile Apps ఉపయోగించడం సురక్షితం కాదని ఏజెన్సీలు వాదించాయి. ఈ యాప్స్ దేశం నుండి భారతీయుల డేటాను పెద్ద ఎత్తున చేరవేస్తునట్లు తెలిపాయి. చైనీస్ డెవలపర్లు లేదా చైనీస్ లింక్‌లతో అభివృద్ధి చేసిన ఈ యాప్స్ స్పైవేర్ లేదా ఇతర హానికరమైన వస్తువులుగా ఉపయోగించవచ్చని ఈ నివేదికలో సూచించబడింది. భద్రతా సంస్థలు ప్రభుత్వానికి పంపిన ఈ జాబితాలో జూమ్, టిక్‌టాక్, యుసి బ్రౌజర్, క్జాండర్, షేర్ ఇట్ మరియు క్లీన్ మాస్టర్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం లేదా భద్రతా సంస్థలు ఇంకా పూర్తిగా వీటిని గురించి ప్రకటించలేదని స్పష్టం చేస్తున్నాము.

52 Chinese Mobile Apps

చైనాకు సంబంధించిన యాప్స్ గా చెబుతున్న ఆ 52 చైనా మొబైల్ యాప్స్ ఇవే

TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo WeChat, SHAREit, UC News, UC Browser BeautyPlus, Xender, ClubFactory, Helo, LIKE, Kwai, ROMWE, SHEIN, NewsDog, Photo Wonder

APUS Browser, VivaVideo- QU Video Inc Perfect Corp, CM Browser, Virus Cleaner (Hi Security Lab) Mi Community, DU recorder,

YouCam Makeup, Mi Store, 360 Security, DU Battery Saver, DU Browser, DU Cleaner, DU Privacy, Clean Master – Cheetah, CacheClear DU apps studio, Baidu Translate, Baidu Map, Wonder Camera, ES File Explorer, QQ International, QQ Launcher, QQ Security Centre, QQ Player, QQ Music, QQ Mail, QQ NewsFeed, WeSync, SelfieCity, Clash of Kings, Mail Master, Mi Video call-Xiaomi, Parallel Space

చైనా యాప్ లను ఆపాలని భద్రతా మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు జాతీయ భద్రతా మండలి సచివాలయం కూడా మద్దతు ఇస్తుంది. ఈ ప్రతిపాదన కౌన్సిల్‌లో చర్చించబడుతోంది. ఈ దరఖాస్తులు భారతదేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని కౌన్సిల్ అభిప్రాయపడింది. కానీ, ఈ ప్రతిపాదన ఇంకా చర్చలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జూమ్ వాడకంపై హోం మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా (CERT-in) ప్రతిపాదనపై మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, భద్రతా సంస్థలే కాకుండా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. Chinese Apps కి వ్యతిరేకంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు, కరోనావైరస్ వ్యాప్తితో  చైనీస్ వాడకాన్ని నిషేధించాలనే ప్రచారం మొదలయ్యింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo