కరెన్సీ నోట్లను గుర్తించానికి కొత్త APP తీసుకురానున్నRBI

కరెన్సీ నోట్లను గుర్తించానికి కొత్త APP తీసుకురానున్నRBI
HIGHLIGHTS

మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా కరెన్సీ నోటు యొక్క ఫోటోను తియ్యడం ద్వారా ఇది జరుగుతుంది.

కరెన్సీ నోట్లను గుర్తించడంలో సహాయపడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఒక కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభిస్తుందని PTI  నివేదించింది. ప్రస్తుతం రూ .10, రూ .20, రూ .50, రూ .100, రూ .200, రూ .500, రూ .2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. కేంద్రం జారీ చేసిన రూ .1 నోట్లు కూడా ఉన్నాయి. PTI నివేదిక ప్రకారం, "భారతీయ నోట్లతో వారి రోజువారీ వ్యాపారాన్ని నిర్వహించడంలో దృశ్యమాన సవాలు ఎదుర్కొంటున్న సవాళ్ళకు RBI  సెన్సిటివ్  గ తీసుకుంది" అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం, ఇంటాగ్లియో ప్రింటింగ్-బేస్డ్ ఐడెంటిఫికేషన్ మార్కులు రూ .100 మరియు అంతకంటే ఎక్కువ నోట్లలో ఉన్నాయి.

అయితే, ప్రతిపాదించబడిన ఈ మొబైల్ అప్లికేషన్, నోట్ల విలువను గుర్తించగలదు. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా కరెన్సీ నోటు యొక్క ఫోటోను తియ్యడం  ద్వారా ఇది జరుగుతుంది. ఈ యాప్‌ను అభివృద్ధి చేయడానికి ఆర్‌బిఐ టెక్ సంస్థల నుండి బిడ్లను ఆహ్వానిస్తోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అటువంటి అప్లికేషన్ ఇప్పటికే మనుగడలో ఉన్నప్పటికీ, RBI  టెక్ సంస్థల నుండి బిడ్లను ఆహ్వానించడం వింతగా ఉంది. గత జనవరిలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), రోపర్, దృష్టి లోపం ఉన్నవారికి కరెన్సీ నోట్లను గుర్తించడంలో సహాయపడటానికి ఒక ఆప్ ను  అభివృద్ధి చేసింది. ఈ అప్లికేషన్ పాత మరియు క్రొత్త కరెన్సీ నోట్లను గుర్తించగలదు మరియు మీరు మీ చేతుల్లో ఏ నోటును పట్టుకున్నారో ఆడియో ద్వారా సమాచారాన్ని ఇస్తుంది. ఈ అప్లికేషన్ను 'రోష్ని' అని పిలుస్తారు మరియు ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగ లభిస్తుంది. కొత్త INR కరెన్సీ నోట్లను విజయవంతంగా గుర్తించిన మొట్టమొదటి Android అప్లికేషన్ కూడా 'రోష్ని' నే అని వాదన. భారత ప్రధాని మోడీ ఇటీవల ఆదేశించిన డీమోనిటైజేషన్ తర్వాత కొత్త కరెన్సీ నోట్లు అమల్లోకి వచ్చాయి. మన దగ్గర ఇప్పుడు రూ .2,000 నోట్లు ఉండగా, పాత రూ .10, రూ .50, రూ .100, రూ .200, రూ .500 నోట్లలో కూడా కొంత మార్పు వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo