Tikok కి పోటీగా Instagram Reels ని తీసుకొచ్చింది

Tikok కి పోటీగా Instagram Reels ని తీసుకొచ్చింది
HIGHLIGHTS

ఈ కొత్త ఫీచర్ iOS మరియు Android లో ప్రారంభించబడింది

ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు TikTok కు పోటీగా వీడియో-మ్యూజిక్ రీమిక్స్ ఫీచర్‌ ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. Instagram Reels పేరుతో రానున్న ఈ ఫీచర్ వినియోగదారులను 15-సెకన్ల మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చెయ్యడానికి అనుమతిస్తుంది మరియు వీటిని స్టోరీస్ గా చెయ్యవచ్చు. వైరల్ వీడియో క్లిప్‌ లను  చూడటానికి వినియోగదారులను అనుమతింపచేసేలా, కంపెనీ ఎక్స్‌ ప్లోర్‌ లో కొత్త టాప్ రీల్స్ విభాగాన్ని రూపొందించింది. టిక్‌ టాక్ మాదిరిగానే, వినియోగదారులు అందుబాటులో ఉన్న మ్యూజిక్ లిస్ట్ నుండి వారి రీల్స్‌ కు పాటలను ప్లే చేయవచ్చు లేదా వేరొకరి వీడియో నుండి ఆడియోను ఉపయోగించవచ్చు.

ఈ కొత్త ఫీచర్ iOS మరియు Android లో ప్రారంభించబడింది, అయితే ఇది ప్రస్తుతం బ్రెజిల్లో మాత్రమే అందుబాటులో ఉంది, ఇక్కడ దీనిని సెనాస్ అని పిలుస్తారు. బ్రెజిల్‌లో, అధికమొత్తంలో ఇన్‌ స్టాగ్రామ్ జనాభా మరియు క్రేయేటర్ కమ్యూనిటీ ఉంది. దీని కారణంగా, సంస్థ ఈ అంశాన్ని పరీక్షిండానికి మరియు ఈ ఆన్‌ బోర్డింగ్ వ్యూహాన్ని అన్నిచోట్లా విడుదల చేయడానికి, ముందుగా సహాయపడుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ లోని అన్ని అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లను రీల్స్ ప్రభావితం చేస్తాయని టెక్ క్రంచ్ నివేదించింది. ఫేస్‌ బుక్ లాస్సో వంటి క్రొత్త యాప్ రూపొందించడానికి బదులుగా, ఇన్‌ స్టాగ్రామ్ రీల్స్‌ ను అదే యాప్ లో ఒక క్రొత్త ఫీచరుగా పరిచయం చేయడం ద్వారా ప్రస్తుతం వాడుకలోనున్న బిలియన్ వినియోగదారులకు, దీన్ని భారీగా క్రాస్-ప్రమోట్ చేయగలదు. ఆసక్తికరంగా, టిక్‌ టాక్ వినియోగదారులను వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరియు వాటిని ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో భాగస్వామ్యం చేయడానికి అనుమతిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ బ్రెజిల్‌ లో మాత్రమే టేకాఫ్ అవుతుందా, లేదా ఇన్‌ స్టాగ్రామ్ ఉనికిలో ఉన్న ఇతర ప్రదేశాలలో కూడా లాంచ్ చేయడానికి పూనుకుంటుందో  వేచి చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo