భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనా నుండి ఆవిర్భవించిన లేదా సంబంధాలున్న China Mobile Apps జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితాలోని మొత్తం 52 యాప్స్ ని వాడకుండా చూసేలా సలహా ఇవ్వమని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశంలో, Android మరియు iOS యాప్స్ వినియోగం సెక్యూరిటీ మరియు ప్రైవసి సమస్యలను ఏజెన్సీలు ఉదహరించాయి.
Survey
✅ Thank you for completing the survey!
హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, “అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తులను” ఉదహరిస్తూ, చైనాతో సంభంధం ఉన్న ఈ Apps ‘భారతదేశ భద్రతకు హానికరం’ అని జాతీయ భద్రతా మండలి సచివాలయం భావిస్తున్నాయి.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జారీ చేసిన జాబితా పైన చర్చలు కొనసాగుతున్నాయని ఒక ప్రభుత్వ అధికారి కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇక అధికారిక నిర్ణయం అతి త్వరలో ప్రకటించవచ్చని కూడా సూచనప్రాయంగా తెలుస్తోంది. ఈ జాబితాలో TikTok, SHAREit, Club Factory వంటి అనేక ప్రసిద్ధ యాప్స్ పేర్లు ఉన్నాయి. ఇవి భారతదేశంలో సోషల్ మరియు ఇ-కామర్స్ వ్యాపారాన్ని నడిపిస్తాయి. జాబితా నుండి ఇతర యాప్స్ విషయానికి వస్తే, Clash of Kings, Beauty Plus వంటి ఫోటోగ్రఫీ యాప్స్ మరియు ఇంకా చాలానే ఉన్నాయి.