HIGHLIGHTS
డేటాని వాడకుండానే Whatsapp ని ఎలా ఉపయోగించవచ్చు
వాట్సాప్ లో ఉపయోగించబడుతున్న మరింత డేటాను సేవ్ చేయవచ్చు.
వాట్సాప్ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు
ప్రతిరోజూ ఎక్కువగా ఉపయోగించే యాప్ ఏదంటే Whatsapp అని తడుముకోకుండా చెప్పే వారే ఎక్కువగా ఉంటారు. చాటింగ్ , మీడియా షేరింగ్, వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్…ఇలా ఒకటేమిటి మనం రోజు చేసే పనులన్నిటినీ వరసపెట్టి మనకు ఇష్టమైన వారికీ షేర్ చెయ్యడానికి ఆశ్రయించేది దీన్నే మరి. అయితే, ఇలా ప్రతి అవసరానికి ఉపయోగపడే ఈ యాప్ మీ డేటాని పూర్తిగా హరించవచ్చు. అందుకే, ఎక్కవగా డేటాని వాడకుండానే మీ Whatsapp ని ఎలా ఉపయోగించ వచ్చునో ఈరోజు చూద్దాం..
Surveyప్రస్తుతం, మనం ఎక్కువగా ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనందరికీ ఎక్కువ డేటా మరియు ఇంటర్నెట్ వేగం అవసరం అవుతాయి. అందుకే, దీనికోసం కొన్ని మంచి పరిష్కారాలను చూడడం మంచింది. తద్వారా వాట్సాప్ లో ఉపయోగించబడుతున్న మరింత డేటాను సేవ్ చేయవచ్చు.
కొన్ని నివేదికల ప్రకారం, వాట్సాప్ వాయిస్ కాల్స్ కోసం నిమిషానికి 740 Kb ల డేటా ఉపయోగిస్తుంది. ఇంటర్నెట్ రద్దీని తగ్గించాలని, తద్వారా అవసరమైన సేవలకు బ్యాండ్‌విడ్త్ ఆదా చేయాలని COAI గతంలో ప్రజలను అభ్యర్థించింది.