government issued notice to meta to stop new username feature in whatsapp
WhatsApp లో త్వరలో అందుబాటులోకి రానున్న Username ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం Meta కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఫీచర్ ను తాత్కాలికంగా అమలు చేయవద్దని సూచించడంతో పాటు, దీనికి సంబంధించిన పూర్తి వివరణను మూడు రోజుల్లో అందించాలని మెటా ను ప్రభుత్వం కోరినట్టు నివేదికలు వెల్లడించాయి. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు యూజర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ఒక్క రోజులో ఈ ఫీచర్ పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం వాట్సాప్ లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే మొబైల్ నెంబర్ కచ్చితంగా అవసరం అవుతుంది. అయితే, వాట్సాప్ కొత్త Username ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారులు తమ ఫోన్ నంబర్ ను వెల్లడించకుండా ప్రత్యేక యూజర్ నేమ్ ద్వారా ఇతరులతో కనెక్ట్ కావచ్చు.
ఈ విధానం ఇప్పటికే Telegram వంటి కొన్ని ఇతర మెసేజింగ్ యాప్ లలో అందుబాటులో ఉంది. అయితే, ఇది వాట్సాప్ లో ఇంకా అమలు కాలేదు మరియు ఇప్పుడు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి యూజర్ నేమ్ ను రిజర్వ్ చేసుకోవడానికి యూజర్లకు వాట్సాప్ ఫీచర్ ను రోల్ అవుట్ చేసింది.
ఇక Meta మాత్రం ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుల గోప్యత మరింత మెరుగుపడుతుందని చెబుతోంది. ఫోన్ నంబర్‌ను ఇతరులకు తెలియజేయకుండా చాట్ చేసే అవకాశం లభించడం వల్ల ప్రైవసీ పెరుగుతుందని సంస్థ పేర్కొంటోంది.
వాట్సాప్ కొత్త ఫీచర్ వల్ల సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ తో నకిలీ యూజర్ నేమ్ తో బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ కంపెనీలు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లు పోలి ఉండే అకౌంట్ ను సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కాకుండా, యూజర్ మొబైల్ నంబర్ కు బదులుగా పేరు ఉపయోగించడం వల్ల మోసగాళ్ల అసలు గుర్తింపును గుర్తించడం చాలా కష్టమవుతుందని కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అందుకే, ఈ ఫీచర్ లో వినియోగదారుల భద్రత కోసం మెటా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటుందో వివరించాలని ప్రభుత్వం వివరణ కోరింది.
అయితే, ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుల ప్రైవసీ మరింత మెరుగుపడుతుందని మెటా చెబుతోంది. ఫోన్ నంబర్ ను ఇతరులకు తెలియజేయకుండా చాట్ చేసే అవకాశం లభించడం వల్ల ప్రైవసీ పెరుగుతుందని ఈ టెక్ దిగ్గజం పేర్కొంటోంది.
ప్రభుత్వం ఈ ఫీచర్ ని పూర్తిగా నిషేదించిందా? అని మీకు డౌట్ రావచ్చు. అయితే, ప్రభుత్వం ఈ ఫీచర్‌ను పూర్తిగా నిషేధించలేదు. అయితే, భద్రతా అంశాలు, సైబర్ మోసాల అవకాశాలు మరియు భారతీయ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాలు పరిశీలిస్తోంది. కాబట్టి, తుది నిర్ణయం వచ్చే వరకు Username ఫీచర్ విడుదల నిలిపివేయాలని ప్రభుత్వం మెటా కు సూచించింది.