మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ 17 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 01 Oct 2020
HIGHLIGHTS
 • జోకర్ (బ్రెడ్) మాల్వేర్ సోకినందుకు 17 యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించింది.

 • జోకర్ మాల్వేర్ భారిన పడిన కారణంగా ఒక 17 యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలగించింది.

 • ఈ స్పైవేర్ SMS సందేశాలు, కాంటాక్ట్ జాబితాలు మరియు డివైజ్ సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడింది

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ 17 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ 17 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ 17 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే, జోకర్ మాల్వేర్ భారిన పడిన కారణంగా ఒక 17 యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలగించింది. వాస్తవానికి, ఈ జోకర్  మాల్వేర్ అనేది రెగ్యులర్ గా కనిపించే మాల్వేర్లల్లో ఒకటి మరియు 2017 నుండి గూగుల్ దీనిని ఎదుర్కొంటోంది. 

అప్పట్లో , జోకర్ మాల్వేర్ భారిన పడి బాధపడుతున్న 1700 కి పైగా యాప్స్ ను గూగుల్ తొలగించింది. ఈ 17 యాప్స్ మాల్వేర్ తో గుర్తించబడటానికి ముందు 120,000 సార్లు డౌన్‌లోడ్ చేయబడ్డాయి. ఈ 17 యాప్స్ జాబితా ఈ క్రింది చూడవచ్చు.

 • All Good PDF Scanner
 • Mint Leaf Message-Your Private Message
 • Unique Keyboard - Fancy Fonts & Free Emoticons
 • Tangram App Lock
 • Direct Messenger
 • Private SMS
 • One Sentence Translator - Multifunctional Translator
 • Style Photo Collage
 • Meticulous Scanner
 • Desire Translate
 • Talent Photo Editor - Blur focus
 • Care Message
 • Part Message
 • Paper Doc Scanner
 • Blue Scanner
 • Hummingbird PDF Converter - Photo to PDF
 • All Good PDF Scanner

Zscaler సెక్యూరిటీ ప్రకారం, “ఈ స్పైవేర్ SMS సందేశాలు, కాంటాక్ట్ జాబితాలు మరియు డివైజ్ సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడింది. అలాగే ప్రీమియం వైర్‌లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ (WAP) సేవలకు బాధితుడిని సైలెంట్ గా సైన్ అప్ చేస్తుంది”. జూలై 2020 లో మరియు సెప్టెంబర్ 2019 లో కూడా జోకర్ మాల్వేర్ వార్తలను చూశాము.

జోకర్ మాల్వేర్‌ను గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎందుకు గుర్తించలేదు?

డివైజ్ కి చేరుకోవటానికి ఈ మాల్వేర్ “డ్రాపర్స్” అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఈ ప్రక్రియ బహుళ దశలను కలిగి ఉంది. స్లీపింగ్ కంప్యూటర్ ప్రకారం, “చట్టబద్ధమైన యాప్స్ లో దాచిన" డ్రాప్పర్లను "తీయటానికి గూగుల్ చాలా కష్టపడుతుందని మాల్వేర్ రచయితలు గత సంవత్సర రీసర్చ్ ద్వారా గ్రహించారు. సంవత్సరాలుగా, ఎక్కువ మంది మాల్వేర్ ఆపరేషన్లు తమ కోడ్‌ను రెండు డ్రాపర్ ‌గా మరియు వాస్తవ మాల్వేర్లలో విభజించే ఈ ఉపాయాన్ని అనుసరించాయి.

కారణం, డ్రాప్పర్లకు తక్కువ సంఖ్యలో అనుమతులు అవసరం మరియు హానికరమైనవిగా వర్గీకరించబడే పరిమిత ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. అంతేకాకుండా, ఏదైనా హానికరమైన కోడ్ అమలును కొన్ని గంటల ఆలస్యం చేసే టైమర్‌లను జోడించడం కూడా గూగుల్ స్కాన్స్  సమయంలో మాల్వేర్ గుర్తించబడకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, వినియోగదారు సిస్టమ్‌లో మాల్వేర్ పనిచేయడంలో ఆలస్యం Google యొక్క భద్రతా దృష్టి నుండి దాచిపెడుతుంది. యాప్  అనుమతులను అడిగినప్పుడు మరియు వినియోగదారు దానిని ఇచ్చినప్పుడు, మాల్వేర్ డివైజ్ కు సోకడం ప్రారంభిస్తుంది. అందువల్ల మీకు అవసరం లేని యాప్స్ కు అనుమతులు ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, కాంటాక్ట్స్ లేదా డయలర్ లేదా సందేశాలను చూడటానికి అనుమతి అడగడానికి టార్చ్ యాప్ కి ఎటువంటి అవసరం లేదు, అందువల్ల అలాంటి అనుమతులు తిరస్కరిం

logo
Raja Pullagura

email

Web Title: If you have these 17 apps on your Android phone, delete them immediately
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status