Whatsapp యూజర్లకు అలర్ట్! ఈ చిన్న తప్పు చేశారో మీ అకౌంట్ Hack అవుతుంది

HIGHLIGHTS

హ్యాకర్లు నిరంతరం కొత్త మార్గాలను కనుగొంటూనే ఉన్నారు

వాట్సాప్‌ లో కొత్త తలనొప్పి మొదలయ్యింది

ఇంటర్నెట్ నేరస్థులు తమ ఖాతాగా మార్చుకోవడానికి హ్యాక్ చేస్తున్నారు

Whatsapp యూజర్లకు అలర్ట్! ఈ చిన్న తప్పు చేశారో మీ అకౌంట్ Hack అవుతుంది

టెక్నాలజీ మరింతగా పెరుగున్న ఈ రోజుల్లో, ప్రజలను వేధించడానికి హ్యాకర్లు నిరంతరం కొత్త మార్గాలను కనుగొంటూనే ఉన్నారు. మనందరికి సుపరిచితమైన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌ లో కొత్త తలనొప్పి మొదలయ్యింది. కొందరి అకౌంట్స్ ను ఇంటర్నెట్ నేరస్థులు తమ ఖాతాగా మార్చుకోవడానికి హ్యాక్ చేస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇందుకోసం, కొత్తగా సాయం మరియు మనవావతా దృక్పధం అనే కోణంలో వంచనకు గురిచేస్తున్నారు. ఇటీవల కొంతమంది వాట్సాప్ యూజర్లు హ్యాకర్లు తమ ఖాతాను ఏ ట్రిక్ ద్వారా లాక్ చేసారో చెప్పారు. సంబంధిత బాధిత వినియోగదారులు తమకు 6-అంకెల కోడ్ సందేశాన్ని అందుకున్నామని, ఆ తర్వాత ఆ నంబర్ గల వారు తమ స్నేహితులు అవుతారని, అనుకోకుండా వారి నంబర్‌ కు బదులు  మీకు పంపించామని, మీరు దాన్ని నాకు తిరిగి పంపగలరా? అని నమ్మ బాలికే మోసపూరిత మాటలతో చర్చలు ప్రారంభమవుతాయి.

వాస్తవానికి, ఇదంతా కూడా ఒక కట్టు కథ. ఎందుకంటే, ఎవరైనా తామ వాట్సాప్ అకౌంట్ లో కొత్త నంబర్ ను అప్డేట్ చేసేప్పుడు వాట్సాప్ 6 అంకెల కోడ్ ను పంపుతుంది. అందుకే, మీ అకౌంట్ హ్యాక్ చేయదలచిన హ్యాకర్లు ఈ కోడ్ ను పొందడానికి ఈ కొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా తమ వాట్సాప్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు షోషల్ మీడియాలో చాలా మంది చెబుతున్నారు.

ఇందులో, మీ అకౌంట్ హ్యాక్ తరువాత మీకు సంబంధించిన చాటింగ్ హిస్టరీ, కాంటాక్ట్స్ మరియు మీకు సంబంధించిన పర్సనల్ డేటా, ఫోటో మరియు వీడియోలు అన్ని కూడా హ్యాకర్ల చేలోకి వెళ్లిపోతాయి. ఇక చెప్పేదేముంది, మీకు మీ డేటాతోనే చెక్ పెట్టేస్తారు హ్యాకర్లు. దీని కోసం, 6 అంకెల కోడ్  వారికీ అవసరం అవుతుంది. అందుకే, ఎవరైనా మీకు చాటింగ్ లేదా కాల్ ద్వారా అనుకోకుండా తప్పుగా OTP లేదా 6 డిజిట్ కోడ్ పంపాను తిరిగి సెండ్ చెయ్యమని లేదా మరింకేదైనా రిక్వెస్టులు నమ్మి మోసపోకండి.

ఇలాంటివి కూడా జరుగుతున్నాయా? అని మీరు అనుకోవచ్చు. జరుగుతున్నాయి కాబట్టే, మోసపోయిన వారు తమ సొంత అనుభవాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి మిగిలిన వారిని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇటువంటి వాటి విషయంలో కొంచం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo