Disney+Hotstar ఇండియాలో ప్రారంభమయ్యింది

Disney+Hotstar  ఇండియాలో ప్రారంభమయ్యింది
HIGHLIGHTS

ఈ సర్వీస్ ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులో ఉంది.

ముందు నుండే ఉహిస్తునట్లుగా, భారతదేశంలో  Hotstar ప్లాట్ఫారం పైన  Disney + కంటెంట్ చివరకు అధికారికంగా వచ్చింది. అంటే ఈ సర్వీస్ ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులో ఉంది. అన్ని డిస్నీ + కంటెంట్‌ తో ఆప్ కోసం, ఈ కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్, iOS , ఆపిల్ టివి, అమెజాన్ ఫైర్ టివి స్టిక్ మరియు ఆండ్రాయిడ్ టివిలతో సహా చాలా ప్లాట్ఫారలలో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. మీరు వెబ్ బ్రౌజర్‌లో కూడా ఈ డిస్నీ + హాట్‌ స్టార్‌ను క్రొత్త రూపంగా ఉపయోగించవచ్చు. ఈ వారం ప్రారంభంలో, హాట్స్టార్ ఏప్రిల్ 3 న డిస్నీ + కంటెంట్‌ను భారతీయ వినియోగదారులకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది మునుపటి తెలిపిన ప్రణాళికల కంటే కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

క్రొత్త చందాదారులు మరియు ప్రస్తుతం ఉన్న చందాదారులు (సబ్ స్క్రిప్షన్ పునరుద్ధరించాల్సిన సమయం వచ్చినప్పుడు) హాట్స్టార్ ప్రీమియం మరియు హాట్స్టార్ VIP వారు ఇప్పటివరకు చెల్లించిన దానికంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వం ఇప్పుడు సంవత్సరానికి 399 రూపాయలు, అంతకుముందు సంవత్సరానికి ఇది 365 రూపాయలుగా ఉండేది. ఫ్లాగ్‌ షిప్ డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం చందా ఇప్పుడు సంవత్సరానికి రూ .1,499 గా ఉంది, ఇది సంవత్సరానికి 999 నుండి మరింతగా పెరిగింది. కొన్ని డిస్నీ + కంటెంట్ VIP కస్టమర్లకు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, మీకు డిస్నీ + స్టార్ వార్స్ స్పిన్ఆఫ్ 'ది మాండలోరియన్' లేదా మార్వెల్, స్టార్ వార్స్, పిక్సర్ కింద ఉన్న అన్ని సినిమాలు వంటి అసలైన కంటెంట్ కావాలంటే మాత్రం మీరు ప్రీమియం సభ్యత్వానికి మారవలసి వుంటుంది.

డిస్నీ APAC యొక్క ప్రెసిడెంట్ మరియు స్టార్ మరియు డిస్నీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ ఒక ప్రకటనలో, "డిస్నీ + హాట్‌స్టార్‌లోని కొన్ని అసలైన డిస్నీ + కంటెంట్‌ లో ది లయన్ కింగ్, ఫ్రోజెన్ II, టాయ్ స్టోరీ 4, అల్లాదీన్ అలాగే ఎవెంజర్స్ మరియు స్టార్ వార్స్ ఫ్రాంచైజ్. " "హాట్స్టార్ విజయంతో, మేము భారతదేశంలో ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ కొత్త శకానికి ప్రవేశించాము. ఈ రోజు, మేము డిస్నీ + హాట్‌స్టార్‌ ను ఆవిష్కరిస్తున్నప్పుడు, వినోదం పొందడమే కాకుండా, ప్రజలకు నాణ్యమైన ప్రభావవంతమైన కథలను భారతదేశం కోసం అందించే మా వాగ్దానానికి కట్టుబడి ఉండటానికి మేము మరొక ముఖ్యమైన అడుగు వేస్తాము. హాట్స్టార్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందించబడిన డిస్నీ యొక్క స్టోరీలు, ఈ కష్ట సమయాల్లో సౌలభ్యం, ఆనందం అందించడానికి మా ప్రేక్షకులకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. " అని అన్నారు. 

మార్చి 29 న డిస్నీ + భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది, మార్చి 10 న కొంతమంది వినియోగదారులకు విడుదల చేయడం ద్వారా కంపెనీ కొంత కంటెంట్‌ను పరీక్షించింది. కంపెనీ దీనిని ఒక రోజు ముందే బీటా పరీక్షలో భాగంగా ఈ రోల్ అవుట్ ఉందని చెప్పారు. భారతదేశంలో, డిస్నీ + హాట్‌ స్టార్ రాక ఇప్పటికే మర్కెట్లో నడస్తున్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వూట్, సోనీ లైవ్, Zee5, జియో సినిమా, Eros Now  మరియు ఇటువంటి మరికొన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారాలతో పోటీగ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo