WhatsApp యాప్ లో ఐదు భద్రతా లోపాల పై CERT-In హెచ్చరిక.. వెంటనే చెక్ చేసుకోండి.!

Highlights

WhatsApp యాప్ లో ఐదు భద్రతా లోపాలు ఉన్నట్లు CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది

వాట్సాప్ మరియు వాట్సాప్ బిజినెస్ యాప్ లలో ఈ ఐదు భద్రతా లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది

ఫైల్స్ తొలగిపోవడం మరియు అప్లికేషన్ డేటా మార్చడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం

అత్యధికంగా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే మెసేజింగ్ యాప్ గా WhatsApp ప్రపంచవ్యాప్తంగా అగ్ర స్థానంలో నిలుస్తుంది. అయితే, ఈ యాప్ లో ఐదు భద్రతా లోపాలు ఉన్నట్లు భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్‌ ఫోన్‌ లో ఉపయోగించే వాట్సాప్ మరియు వాట్సాప్ బిజినెస్ యాప్ లలో ఈ ఐదు భద్రతా లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ సమస్యలకు సంబంధించి ఇదే నెలలో నవంబర్ 26వ తేదీన CIVN-2026-0576 పేరుతో హై సీవియారిటీ అడ్వైజరీ ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. వాట్సాప్ లో ఉన్న ఈ ఐదు లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుంటే యూజర్ల వ్యక్తిగత సమాచారం తరలి పోవడం, ఫోన్‌ లోని కొన్ని ఫైల్స్ తొలగిపోవడం మరియు అప్లికేషన్ డేటా మార్చడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

WhatsApp లో 5 భద్రతా లోపాలు ఏమిటి ?

వాట్సాప్ అధికారిక సెక్యూరిటీ అడ్వైజరీ ప్రకారం, మొత్తం ఐదు CVE భద్రతా లోపాలు ఉన్నట్లు తెలిపారు. వీటిలో మూడు నవంబర్ 2026 అప్‌డేట్‌ లో మరియు మరో రెండు లోపాలను మే 2026 అప్‌డేట్‌ లో వివరించారు. CVE-2026-102769 అనే లోపం వల్ల ప్రత్యేకంగా రూపొందించిన ఆర్డర్ డీటెయిల్స్ మెసేజ్‌ ను ఓపెన్ చేసినప్పుడు ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ లో స్టోర్ అయిన వాట్సాప్ ఫైల్స్ తొలగిపోయే ప్రమాదం ఉంది.

మరో లోపం (CVE-2026-44908) అనేది Meta AI సెక్యూరిటీ సిస్టమ్‌ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ కు సంబంధించినది. అలాగే, CVE-2026-23871 లోపం కారణంగా ప్రత్యేకంగా రూపొందించిన అడ్వర్టైజ్‌మెంట్ రిప్లై మెసేజ్‌ ద్వారా యూజర్ల IP సమాచారం బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. మిగిలిన రెండు లోపాల్లో ఒకటి AI రిచ్ రెస్పాన్స్ వెరిఫికేషన్‌ కు మరియు మరొకటి Windows యాప్‌ లోపల ఫైల్ అటాచ్మెంట్ స్పూఫింగ్‌ కు సంబంధించినవి.

ఎవరికి ముప్పు ఉంది?

CERT-In అడ్వైజరీలో వాట్సాప్ ఆండ్రాయిడ్, వాట్సాప్ బిజినెస్, iOS మరియు Mac వెర్షన్లలోని కొన్ని పాత సాఫ్ట్‌ వేర్ వెర్షన్లను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. Windows అటాచ్మెంట్ సమస్య గురించి వాట్సాప్ తన అధికారిక సెక్యూరిటీ అడ్వైజరీలో విడిగా వెల్లడించింది.

WhatsApp యూజర్లు ఏం చేయాలి?

ఈ సమస్యల నుంచి అకౌంట్ ను మరియు స్మార్ట్ ఫోన్ ను సురరక్షితంగా ఉంచేందుకు వాట్సాప్ యూజర్లు ఫోన్ లో వున్న వాట్సాప్ యాప్‌ ను వెంటనే లేటెస్ట్ వెర్షన్‌ తో అప్‌ డేట్ చేసుకోవాలి. ఇందుకోసం Google Play Store లేదా Apple App Store లో వాట్సాప్ అని సెర్చ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు.

అంతేకాదు, తెలియని వ్యక్తులు పంపిన అనుమానాస్పద లింకులు లేదా ఫైల్స్ ని ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. అలాగే, వాట్సాప్ లో Linked Devices సెక్షన్‌ ను పరిశీలించి మీకు తెలియని డివైజ్‌ తో లింక్ అయ్యుంటే వెంటనే లాగ్ అవుట్ చేయాలి.

గమనిక: ఈ హెచ్చరిక కేవలం ఐదు భద్రతా లోపాలకు సంబంధించి అందించిన హెచ్చరిక. అంతేగాని అన్ని వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయని దీని అర్థం కాదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile