bat bms app facts and viral news
రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక యాప్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే BAT-BMS యాప్. రోడ్డుపై వెళ్తున్న ఈ-రిక్షాలు (E-Rickshaws) ఒక్కసారిగా ఆగిపోతుండగా, వాటిని మొబైల్‌లోని ఈ యాప్ ద్వారా నియంత్రిస్తున్నట్లు కొన్ని వైరల్ వీడియోలలో చూపిస్తున్నారు. దీంతో “ఒక యాప్ తో నిజంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఆపేయవచ్చా?” అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. అయితే, ఇందులో నిజానిజాలు ఏమిటి మరియు ఈ కొత్త యాప్ కథేమిటో కూడా తెలుసుకోండి.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) యాప్ ని ఇలా పిలుస్తారు. ఈ యాప్ బ్లూటూత్ ద్వారా బ్యాటరీ కి కనెక్ట్ అయి బ్యాటరీ ఛార్జ్, వోల్టేజ్, ఉష్ణోగ్రత కరెంట్ మరియు మరియు సెల్ హెల్త్ వంటి వివరాలను చూపిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే అని యాప్ నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా ఈ రిక్షా యజమానులు తమ బ్యాటరీ పనితీరును పర్యవేక్షించేందుకు దీనిని ఉపయోగిస్తారు.
అయితే, ఈ యాప్ తో రోడ్డుపై నడిచే ప్రతి బ్యాటరీ రిక్షా ను నిలిపి వేస్తున్నట్టు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా అయితే స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేసే ప్రతి ఒక్కరు ఈ రిక్షా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అయితే, ఇందులో నిజమెంత ఉందో తెలుసుకోండి.
నిపుణుల ప్రకారం, ఈ యాప్ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను హ్యాక్ చేయదు. అయితే, కొన్ని తక్కువ చీప్ లిథియం బ్యాటరీల్లో బ్లూటూత్ ఆధారిత BMS ఉండి, సరైన పాస్ వర్డ్ లేదా భద్రతా వ్యవస్థ లేకపోతే సమీపంలో ఉన్న వ్యక్తి ఆ బ్యాటరీ తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ అవుట్ పుట్ ను నిలిపివేయడం వల్ల ఈ-రిక్షా ఆగిపోవచ్చు. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే, యాప్ లోని ఫీచర్ కంటే, బ్యాటరీ భద్రతలో ఉన్న లోపం అని నిపుణులు చెబుతున్నారు.
ఈ యాప్ తో EV లు ప్రమాదంలో పడతాయా? అని అడిగితే లేదు, అని సూటిగా చెబుతారు. ఎందుకంటే, ఈ సమస్య బ్లూటూత్ BMS ఉన్న కొన్ని లిథియం బ్యాటరీ లకు మాత్రమే పరిమితం కావచ్చు. లీడ్ యాసిడ్ బ్యాటరీలు లేదా అధునాతన సెక్యూరిటీ వ్యవస్థ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ యాప్ ప్రభావం చూపుతుందని ఎటువంటి ఆధారాలు ప్రస్తుతం లేవు.
Also Read: WhatsApp కొత్త ఫీచర్‌ను నిలిపివేయాలని Meta కు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.!
ఇలాంటి ఘటన వల్ల రోడ్డు పై ప్రయాణిస్తున్న డ్రైవర్ మరియు ప్రయాణికుల భద్రత కు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ-రిక్షా డ్రైవర్ల జీవనోపాధి పైన ప్రభావం పడవచ్చు. అందుకే, బ్యాటరీ తయారీ సంస్థలు బలమైన పాస్ వర్డ్ రక్షణ, ఎన్‌క్రిప్షన్, సురక్షిత బ్లూటూత్ పైరింగ్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని, సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇది అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభావితం చేసే సమస్య కాదు. అయినప్పటికీ, ఈ ఘటన ఎలక్ట్రిక్ వాహనాల సైబర్ భద్రత పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.