కొనసాగుతున్న Chinese Apps వేట : ఇండియాలో మరో 47 యాప్స్ పైన నిషేధం

కొనసాగుతున్న Chinese Apps వేట : ఇండియాలో మరో 47 యాప్స్ పైన నిషేధం
HIGHLIGHTS

ఈ లిస్టులో PUBG ని కూడా చేర్చనున్నారని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Chinese Apps ఈ యాప్స్ పూర్తిగా చైనా యాప్స్ కాకపోయినప్పటికీ, ఇవి చాలా వరకూ చైనాతో సంబంధాలను కలిగివున్నాయి.

ఈ 47 క్లోన్ యాప్స్ లో ikTok Lite, Helo Lite, Shareit Lite, Bigo Live Lite, మరియు YFV Lite వంటి యాప్స్ ఉన్నాయి

భారత చైనా మధ్య తలెత్తిన వివాదం తరువాత, గత నెలలో చైనాకి సమాచారం చేరవేస్తనట్లుగా ఆరోపణలకారణంగా TikTok వంటి 59 ప్రముఖ యాప్స్ ని  నిషేధించిన విషయం తెలిసిందే. అయితే , దీనికి కొనసాగింపుగా ఇండియా మరో 47 చైనా యాప్ ‌లను కూడా నిషేధించింది. ఈ యాప్స్ పూర్తిగా చైనా యాప్స్ కాకపోయినప్పటికీ, ఇవి చాలా వరకూ చైనాతో సంబంధాలను కలిగివున్నాయి. ఈ యాప్స్, గత నెలలో భారతదేశంలో నిషేధించబడిన యాప్స్ కంపెనీలకు చెందినవి కావడం విశేషం.

ఈ 47 క్లోన్ యాప్స్ లో ikTok Lite, Helo Lite, Shareit Lite, Bigo Live Lite, మరియు YFV Lite వంటి యాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ వాటి పూర్తి జాబితా గురించి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు కాని త్వరలో వెల్లడి అవుతుందని అనుకుంటున్నారు. ఈ సమాచారం ANI నుండి బయటకి వచ్చింది . ఈ ఉత్తర్వును శుక్రవారం రోజినే జారీ చేసినట్లు PTI ద్వారా కూడా బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది.

 

 

ఈసారి, రాడార్‌పై 275 చైనీస్ యాప్‌ లను ఉంచామని ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. Xiaomi का Zili, AliExpress మరియు ByteDance యొక్క Resso App కూడా చేర్చబడిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ లిస్టులో PUBG ని కూడా చేర్చనున్నారని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి.     

ఇక గత నెలలో ఇండియాలో నిషేధించబడ్డ యాప్స్ విషయానికి వస్తే, ఈ యాప్స్ దేశం నుండి భారతీయుల డేటాను పెద్ద ఎత్తున చేరవేస్తునట్లు,  చైనీస్ డెవలపర్లు లేదా చైనీస్ లింక్‌లతో అభివృద్ధి చేసిన ఈ యాప్స్ స్పైవేర్ లేదా ఇతర హానికరమైన వస్తువులుగా ఉపయోగించవచ్చని  సూచించబడింది. ఈ అభ్యర్ధనల తరువాత భారత ప్రభుత్వం అనూహ్యంగా ఈరోజు ఈ 59 చైనా యాప్స్ ని నిషేదిస్తునట్లు ప్రకటించింది.     

బ్యాన్ చెయ్యబడ్డ 59 Chinese Mobile Apps

TikTok, Shareit, Kwai, UC Browser, Baidu map, Shein, Clash of Kings, DU battery saver, Helo, Likee, YouCam makeup, Mi Community, CM Browers, Virus Cleaner, APUS Browser, ROMWE, Club Factory, Newsdog, Beutry Plus, WeChat,

UC News, QQ Mail, Weibo, Xender, QQ Music, QQ Newsfeed, Bigo Live, SelfieCity, Mail Master, Parallel Space, Mi Video Call — Xiaomi, WeSync, ES File Explorer, Viva Video — QU Video Inc, Meitu,

 Vigo Video, New Video Status, DU Recorder, Vault- Hide, Cache Cleaner DU App studio, DU Cleaner, DU Browser, Hago Play With New Friends,

Cam Scanner, Clean Master — Cheetah Mobile, Wonder Camera, Photo Wonder, QQ Player, We Meet, Sweet Selfie, Baidu Translate, Vmate, QQ International, QQ Security Center, QQ Launcher, U Video, V fly Status Video, Mobile Legends, మరియు DU Privacy।    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo