How to Build Your Own AI Tool Without Coding
నేటి ఆధునిక కాలంలో AI (Artificial Intelligence) చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముందుగా AI టూల్స్ తయారు చేయాలంటే coding తప్పనిసరి అయ్యేది. కానీ, ఇప్పుడు కోడింగ్ తెలియకపోయినా కూడా మీకు అవసరమైన AI tool ను మీరు సొంతంగా మరియు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా మీ స్వంత ఏఐ టూల్ మీరే తయారు తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈరోజు కూలంకషంగా తెలుసుకోండి.
ఏఐ టూల్ అంటే మన పనులను ఆటోమేట్ చేయడానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్ వేర్. ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే, చాట్ బాట్, కంటెంట్ జనరేటర్, ఇమేజ్ క్రియేటర్ మరియు రెజ్యూమ్ బిల్డర్ వంటి వాటిని చెప్పవచ్చు.
కోడింగ్ అవసరం లేకుండా మీ సొంత ఏఐ టూల్ తయారు చేయడానికి మీరు ఉపయోగించ గల కొన్ని లేటెస్ట్ ప్లాట్ ఫామ్స్ సహాయం తీసుకోవాలి. ఇందులో చాట్ జిపిటి, గూగుల్ జెమినీ, జాపియర్ మరియు Notion Ai వంటి ప్లాట్ ఫామ్ లు ఉంటాయి. ఎందుకంటే, ఇవి నో కోడ్ లేదా లో కోడ్ టూల్స్ గా ఉంటాయి.
ముందుగా మీ ఏఐ టూల్ ఐడియా నిర్ణయించండి. అంటే, ముందుగా మీరు ఏ పని కోసం టూల్ తయారు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీ అవసరానికి తగిన టూల్ ని క్లియర్ గా ఎంచుకోండి. మీ బ్లాగ్ కోసం బ్లాగ్ రైటర్ లేదా మీ ఇంస్టాగ్రామ్ ఛానల్ కోసం క్యాప్షన్ రైటర్ లేదా మీ బిజినెస్ కోసం కస్టమర్ సపోర్ట్ చాట్ బాట్ వంటి ఏదైనా ఒక పని కోసం టూల్ క్రియేట్ చేసుకోవచ్చు.
మీ టూల్ క్రియేట్ చేయడానికి సరైన ప్లాట్ ఫామ్ ను ఎంచుకోండి. ఇందులో చాట్ బాట్ కోసం చాట్ జిపిటి బెటర్ గా ఉంటుంది. అదే, ఆటోమేషన్ కోసం అయితే Zapier మరియు వర్క్ ఫ్లో కోసం Make బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ప్లాట్ ఫామ్ ఎంచుకున్న తర్వాత ‘Prompt Design’ ఇవ్వండి. ఇక్కడ ప్రాంప్ట్ డిజైన్ అన్నింటి కన్నా ముఖ్యమైనది. ఎందుకంటే, ప్రాంప్ట్ తో మీ ఏఐ టూల్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు కోరుకునే అంశాలు ఈ ప్రాంప్ట్ లో క్లియర్‌గా ఉండాలి.
మీ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్ ఒక టూల్ గా ఆటోమేటిక్‌గా పని చేయాలంటే, ఆటోమేషన్ సెటప్ చేయండి. మీ టూల్ ఆటోమేటిక్‌గా పని చేయాలంటే Zapier ఉపయోగించి Form – AI – అవుట్ పుట్ కనెక్ట్ చేయండి. ఇలా చేసిన తర్వాత UI (User Interface) తయారు చేయండి. మీ టూల్ యూజర్ ఫ్రెండ్లీ గా ఉండాలి. దీనికోసం మీరు Notion AI లేదా గూగుల్ ఫామ్స్ లేదా సింపుల్ వెబ్సైట్ బిల్డర్స్ టూల్ ను ఉపయోగించవచ్చు.
ఇక మీ టూల్ తయారయ్యాక ఆ టూల్ ను టెస్ట్ చేయండి. ఇందులో ఏదైనా Errors ఉంటే fix చేయండి. అవసరమైతే మరింత బెటర్ ప్రాంప్ట్ ఉపయోగించండి.
Also Read: భారీ 500W సబ్ ఉఫర్ తో 5.1 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!
ఇది తయారు చేయడానికి ప్రాక్టికల్ ఉదాహరణ కూడా ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు AI Blog Writer Tool క్రియేట్ చేయడం చూద్దాం. దీనికోసం ముందుగా Chat GPT లో ప్రాంప్ట్ సెట్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన ప్రాంప్ట్ ను Zapier కనెక్ట్ చేయండి. ఇందులో యూజర్ టాపిక్ ఇస్తే AI blog generate అవుతుంది. అంతే, ఇందులో మీరు ఎటువంటి కోడింగ్ ఇవ్వాల్సిన పనిలేదు మరియు జస్ట్ నిముషాల్లో మీ సొంత ఏఐ టూల్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
అయితే, మీరు ఏఐ టూల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైవసీ డేటా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేదంటే, మీ ప్రైవసీ కి భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది.