How to Turn Your Old Smartphone Into an AI Security Camera
AI Security Camera: మీ ఇంట్లో పక్కన పడేసిన పాత స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందా? అయితే దాన్ని అమ్మేయడం లేదా బీరువాలో పెట్టడం మానేసి దాన్ని ఒక AI ఆధారిత సెక్యూరిటీ కెమెరా గా మార్చుకోవచ్చు. మీ ఇంటికోసం ఖరీదైన CCTV కెమెరాలు కొనే అవసరం లేకుండా మీ పాత ఫోన్ తోనే ఇంటి భద్రతను పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా, ఈ సెటప్ చాలా ఈజీగా ఉంటుంది మరియు మీరు ఎటువంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరి మీ పాత స్మార్ట్ ఫోన్ ను AI సెక్యూరిటీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ ఎంత పాతది అయినా అందులో కెమెరా, మైక్, వైఫై వంటి సెక్యూరిటీ కెమెరాకి అవసరమైన అన్ని ఫీచర్లు ఉంటాయి. కాబట్టి, మంచి AI యాప్ సహాయంతో ఈ పాత స్మార్ట్ ఫోన్ ను AI సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవచ్చు.
వంటి చాలా లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు ఈ AI సెక్యూరిటీ కెమెరా లో పొందవచ్చు.
మీరు మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఏఐ కెమెరా గా మార్చాలంటే పైన సూచించిన అన్ని అవసరం అవుతాయి.
ఈ లిస్ట్ లో ముందుగా ఉండే యాప్ Alfred Camera యాప్ మరియు ఈ యాప్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రెండు ఫోన్ లను కనెక్ట్ చేసి ఒకదాన్ని కెమెరాగా, మరొకదాన్ని మానిటర్ గా ఉపయోగించవచ్చు. అంటే, మీరు ఉపయోగించే ఫోన్ ను మోనిటర్ గా మరియు మీ పాత ఫోన్ ను సెక్యూరిటీ కెమెరాగా ఉపయోగించవచ్చు.
Manything యాప్ కూడా ఈ లిస్ట్ లో నిలుస్తుంది. ఈ యాప్ యూజర్ అనుకూలంగా ఉంటుంది మరియు AI ఆధారిత మోషన్ అలర్ట్స్ తో పాటు క్లౌడ్ స్టోరేజ్ అందిస్తుంది. ఇక మూడవ యాప్ DroidCam యాప్ ద్వారా పీసీ లేదా మొబైల్ ద్వారా లైవ్ వీడియో చూడవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ సెక్యూరిటీ కెమెరా సెటప్ చేసే విధానం సెటప్ బై సెటప్ వివరంగా చూద్దాం.
ముందుగా పైన సూచించిన యాప్ లలో మీకు నచ్చిన ఒక యాప్ ను మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేయండి. యాప్ లో ఉండే కెమెరా మోడ్ ఆన్ చేయండి. అంటే, యాప్ లో ఉండే “కెమెరా డివైజ్” లేదా “మోనిటర్ మోడ్” ను ఎంపిక చేయండి. తర్వాత మీ పాత ఫోన్ ను సరైన ప్రదేశంలో ఉంచండి. అంటే, ఇంటి ప్రధాన ద్వారం, హాల్ లేదా పార్కింగ్ ఏరియాలో మీ పాత ఫోన్ ను స్టాండ్ తో ఫిక్స్ చేయండి. ఈ ఫోన్ కు పవర్ కనెక్షన్ ఇవ్వండి. సెక్యూరిటీ కెమెరాగా ఉంచిన ఫోన్ ను ఎప్పుడూ ఛార్జింగ్ లో ఉంచితే నిరంతర మానిటరింగ్ సాధ్యమవుతుంది. అందుకే, ఈ ఫోన్ కు ఎప్పుడు పవర్ కనెక్షన్ ను ఆన్ లో ఉంచండి. అంతే, మీ ఏఐ సెక్యూరిటీ కెమెరా రెడీ అయిపొయింది.
Also Read: Vu Dolby Atmos సౌండ్ బార్ QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
మీ ఫోన్ లో బలమైన పాస్‌వర్డ్ వాడండి. మీ ఫోన్ డౌన్ లోడ్ చేసుకున్న యాప్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయండి. ముఖ్యంగా, మీరు పబ్లిక్ Wi-Fi వాడకండి. మీరు సెట్ చేసిన పాత ఫోన్ లో కేవలం కెమెరా యాక్సెస్ ను మాత్రమే పరిమితం చేయండి.
AI టెక్నాలజీ వల్ల మీ సెక్యూరిటీ కెమెరా మనుషులను గుర్తించగలదు. అలాగే, పెట్స్ మరియు వాహనాలు కూడా వేరు చేయగలదు. మీ కెమెరా ముందు ఏదైనా అనుమానాస్పద కదలికల ఉంటే వెంటనే అలర్ట్ పంపుతుంది. రాత్రి వేళల్లో కూడా మీకు స్పష్టమైన విజన్ ఇస్తుంది.