ఆన్‌లైన్‌ లో ఆధార్‌ తో పాన్ కార్డు ఎలా లింక్ చేయాలి: పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్

HIGHLIGHTS

పాన్ కార్డు ను ఆధార్ తో లింక్ చేయడం భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ప్రక్రియ

గుర్తింపు ధృవీకరణ మరింత పారదర్శకంగా చేయడం దీని ప్రధాన ఉద్దేశం

మీ ఇంట్లో కూర్చునే జస్ట్ నిమిషాల్లో ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు

పాన్ (PAN) కార్డు ను ఆధార్ (Aadhaar) తో లింక్ చేయడం భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ప్రక్రియ అని అందరికీ తెలిసిన విషయమే. పన్ను సంబంధిత సేవలు సులభతరం చేయడం, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండకుండా నిరోధించడం మరియు గుర్తింపు ధృవీకరణ మరింత పారదర్శకంగా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్‌ తో లింక్ చేయకపోతే, మీ ఇంట్లో కూర్చునే జస్ట్ నిమిషాల్లో ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

పాన్ మరియు ఆధార్ ను లింక్ చేయడానికి ముందుగా మీ పాన్ మరియు ఆధార్ వివరాలతో పాటు ఆధార్ తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ను దగ్గర ఉంచుకోవాలి.

ఆన్‌లైన్‌ లో PAN Aadhaar లింక్ చేసే విధానం

ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక e-Filing పోర్టల్‌ ను తెరవండి. తర్వాత హోమ్‌పేజీలో కనిపించే Link Aadhaar ఎంపికపై క్లిక్ చేయండి. మీ PAN నంబర్ మరియు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. స్క్రీన్‌పై కనిపించే వివరాలు సరైనవో లేదో ధృవీకరించండి. అవసరమైతే ఆధార్‌ కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ కు వచ్చే OTP నమోదు చేయండి.

అంతే, మీ వివరాలను మరోసారి పరిశీలించి Submit లేదా Link Aadhaar బటన్‌పై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే మీ పాన్ మరియు ఆధార్ విజయవంతంగా లింక్ అయినట్లు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది.

PAN Aadhaar లింక్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

  • ఆదాయపు పన్ను శాఖ e-Filing పోర్టల్‌ కు వెళ్లండి.
  • Link Aadhaar Status ఎంపికను ఎంచుకోండి.
  • PAN నంబర్ మరియు ఆధార్ నంబర్ నమోదు చేయండి.
  • View Link Aadhaar Status పై క్లిక్ చేస్తే మీ లింకింగ్ స్టేటస్ వెంటనే కనిపిస్తుంది.

లింక్ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మీ PAN మరియు ఆధార్‌ లో ఉన్న పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఒకే విధంగా ఉండాలి. వివరాల్లో ఏమైనా తేడాలు ఉంటే ముందుగా సంబంధిత రికార్డుల్లో సవరణలు చేయాలి. ఆధార్‌ తో మొబైల్ నంబర్ రిజిష్టర్ ఉండటం ద్వారా మాత్రమే OTP ధృవీకరణ సాధ్యం అవుతుంది. ఒకవేళ ఆలస్య రుసుము వర్తించే సందర్భం ఉంటే, ముందుగా ఆ చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే లింకింగ్ ప్రక్రియ కొనసాగించాలి.

Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే అందుకోండి.!

ఆధార్ పాన్ పై తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

PAN–Aadhaar లింక్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? అని ఎక్కువగా ఆడుతున్నారు. సాధారణంగా కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కొన్ని సందర్భాల్లో అప్‌డేట్ కావడానికి కొంత సమయం పట్టవచ్చు.

రెండవ ప్రశ్న మొబైల్ ఫోన్ ద్వారా కూడా లింక్ చేయొచ్చా? అని అడుగుతున్నారు. దీనికి సమాధానం అవును, మీరు మీ స్మార్ట్‌ ఫోన్‌ బ్రౌజర్ ద్వారా అధికారిక e-Filing పోర్టల్‌ ను ఉపయోగించి లింక్ చేయవచ్చు.

మూడవ ప్రశ్న PAN మరియు ఆధార్‌లో వివరాలు వేర్వేరుగా ఉంటే ఏమి చేయాలి? అని అడుగుతున్నారు. దీనికి సమాధానం, ముందుగా సంబంధిత విభాగంలో వివరాలు సరిచేసి, ఆ తర్వాత లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఆధార్ పాన్ లింక్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది చాలా సులభమైన ఆన్‌లైన్ ప్రక్రియ. మీరు సరైన వివరాలను నమోదు చేసి, అవసరమైన ధృవీకరణ పూర్తిచేస్తే కొద్ది నిమిషాల్లోనే లింకింగ్ పూర్తి చేయవచ్చు. ఇలా లింక్ చేయడం ద్వారా భవిష్యత్తులో పన్ను సంబంధిత సేవల్లో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :