How to check PF balance online in Telugu
ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కలిగి ఉండడం ముఖ్యం. ఇది ఉద్యోగి రిటైర్మెంట్ కోసం దాచుకునే ముఖ్యమైన పొదుపు ఖాతా. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అవుతుంది. ఉద్యోగి వాటాతో పాటు యజమాని తన వంతు వాటా అమౌంట్ ను ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంది. ఈ అమౌంట్ మొత్తం కూడా పదవీ విరమణ సమయంలో వడ్డీ తో సహా అందుకుంటాడు. అయితే, ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో ప్రతి నెల ఎంత మొత్తం జమ అవుతుంది మరియు అకౌంట్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవడం చాలా మంచి విషయం. ఒకప్పుడు ఇలా తెలుసుకోవడానికి EPFO ఆఫీస్ ను సందర్శించాల్సిన అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు జస్ట్ మీ మొబైల్ ఫోన్ లోనే PF Balance ఆన్‌లైన్ లో చెక్ చేసుకోవచ్చు.
మీ PF ఖాతాలో ఇప్పటివరకు ఎంత మొత్తం జమ అయింది? ఇందులో ఉద్యోగి వాటా ఎంత? యజమాని వాటా ఎంత? జమ చేసిన అమౌంట్ కి వడ్డీ ఎంత వచ్చింది? వంటి వివరాలను తెలుసుకోవడానికి ఇప్పుడు PF ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. UAN, EPFO అఫీషియల్ సైట్, UMANG App, SMS లేదా Missed Call వంటి మార్గాల ద్వారా చాలా సులభంగా మీ పిఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో బ్యాలెన్స్ వివరాలు ఆన్‌లైన్ లోచెక్ చేయడానికి సాధారణంగా కొని వివరాలు అవసరం అవుతాయి. ఇందులో UAN (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ముఖ్యం. అలాగే, ఈ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తో నమోదైన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అవసరం అవుతాయి. ఈ వివరాలతో UAN పోర్టల్ ద్వారా మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ ఆన్లైన్ లో చెక్ చేయవచ్చు.
UAN అనేది ఒక ఉద్యోగికి సంబంధించిన వివిధ ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాతో అనుసంధానించడానికి ఉపయోగించే ప్రత్యేక నంబర్. ఉద్యోగం మారినప్పుడు కూడా ఇదే UAN ను కొత్త కంపెనీకి ఇవ్వడం ద్వారా కొత్త PF Member ID ను UAN తో లింక్ చేయవచ్చు.
మీరు అఫీషియల్ UAN పోర్టల్ లో మీ యూఏఎన్ నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి. ఇక్కడ అకౌంట్ బాలన్స్ ద్వారా మీ అన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతా బ్యాలెన్స్ ను చే చేయవచ్చు.
EPFO అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ పిఎఫ్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేయవచ్చు. దీనికోసం, EPFO అధికారిక Member Portal ను ఓపెన్ చేయండి. మీ UAN మరియు Password ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. ఈ మెంబర్ పోర్టల్ లో UAN, Password, Captcha ద్వారా సైన్ ఇన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత పిఎఫ్ పాస్ బుక్ ను ఎంచుకోండి. ఇక్కడ సాధారణంగా మీ ఖాతాలో నెలవారీ జమలు కనిపిస్తాయి.
Also Read: Poco X8 5G లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ .. జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ కావచ్చని అంచనా.!
ఉమాంగ్ యాప్ ద్వారా మీ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి.
ఇక్కడ అందుబాటులో ఉన్న మీ పీఎఫ్ అకౌంట్ మరియు పాస్ బుక్ వివరాలు చూడవచ్చు.
ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా కూడా మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికోసం EPFO అందించే Missed Call సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. అయితే, ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి మీ UAN కు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి.
ఇక ప్రాసెస్ విషయానికి వస్తే, మీ UAN కు లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ సర్వీస్ కి కాల్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా బంద్ అవుతుంది. ఈ నెంబర్ తో రిజిస్టర్ అయిన పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ డీటైల్స్ మీకు సామ్స రూపంలో అందించబడతాయి.