Xiaomi రెడ్మి 3S Prime కంప్లీట్ తెలుగు రివ్యూ

Xiaomi రెడ్మి 3S Prime కంప్లీట్ తెలుగు రివ్యూ

రేటింగ్: 79/100

Pros(ప్లస్): చాలా ఎక్కువ బ్యాటరీ లైఫ్, ధరకు తగ్గా మంచి పెర్ఫార్మన్స్, 32GB స్టోరేజ్, అదనపు sd కార్డ్ సదుపాయం

Cons(మైనస్): కెమెరా కొంచెం ఇంకా బెటర్ గా ఉండి ఉండవలసింది

బిల్డ్ అండ్ డిజైన్: బాగుంది కాని ఇంకా బెటర్ గా ఉండే అవకాశం కూడా ఉంది.
ఇది రెడ్మి నోట్ 3 లానే ఉంది. కొత్తగా ఏమి అనిపించదు లుక్. ఇక కంపెని నెక్స్ట్ ఫోనుల నుండి డిజైన్ పై కూడా ప్రత్యెక శ్రద్ద వహించాలి. అలాగని ఇది బాడ్ కాదు. కాని రొటీన్. 5 in స్క్రీన్ అవటం వలన సులభంగా ఉంటుంది చేతిలో.  ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫెక్ట్ ప్లేస్ మెంట్ తో వస్తుంది. ఫ్రంట్ లో మెటల్ trimming కూడా డిస్ప్లే ను కొంచెం లోపలకి నెట్టి వేసినట్లు ఉంటుంది. బాగుంది.

రెడ్మి నోట్ 3 లానే దీనిలో కూడా స్పీకర్స్ వెనుక ఉన్నాయి. బెడ్ లేదా ఇతర surfaces పై పెడితే సౌండ్ muffle అవుతుంది. ఓవర్ ఆల్ గా రెడ్మి 1S మరియు రెడ్మి 2 తో పోలిస్తే డిజైన్ బాగా అప్ గ్రేడ్ అయ్యింది. వెనుక ఉన్న మెటాలిక్ ఫినిషింగ్ ప్రీమియం గా ఉంటుంది. రౌండ్ గా ఉంటుంది ఫోన్ వీలైనంత వరకూ. లైట్ వెయిట్, కాంపాక్ట్ గా ఉంది.

డిస్ప్లే: చాలా వాటి కన్నా bright గా ఉంది డిస్ప్లే
720P HD అంటే కరెంట్ మార్కెట్ లో ఫుల్ HD ఉండాలి కదా అనుకుంటారు. కాని దీనిలో 5 in 294PPi డిస్ప్లే ఏ మాత్రం ఇబ్బందిగా ఉండదు. బ్రైట్ గా ఉంది, ఆటో బ్రైట్ నేస్ ఆఫ్ చేస్తే highest బ్రైట్ నెస్ 610 lux వస్తుంది. అంటే రెడ్మి నోట్ 3(510 lux) కన్నా ఎక్కువ. Le 2(614 lux) కు దగ్గరిలో ఉన్నట్లు బ్రైట్ నేస్ ఇంచుమించు. meizu నోట్ 3 లో 504 lux ఉంది. ఇక కలర్స్ కూడా vibrant, crisp గా ఉన్నాయి. కొంచెం cooler కలర్స్ ను ఎక్కువుగా చూపిస్తున్నట్లు ఉంటుంది. warmer కలర్ tone నచ్చిన వారు రీడింగ్ మోడ్ ను ఆన్ చేసి one-fourth మార్క్ కు కొంచెం తక్కువుగా intensity సెట్ చేస్తే వార్మ్ గా ఉంటుంది. అలాగే వార్మ్ సెట్టింగ్ ను కూడా వాడగలరు డైరెక్ట్ గా కలర్స్ అండ్ కాంట్రాస్ట్ ఆప్షన్స్ లోకి వెళ్లి. టచ్ రెస్పాన్స్ టాప్ notch అని చెప్పాలి. అస్సలు complains ఏమి లేవు.

పెర్ఫార్మన్స్: కూల్ అండ్ calm
స్నాప్ డ్రాగన్ 430 ఆక్టో కోర్ ప్రొసెసర్ adreno 505 GPU తో వస్తుంది. Injustice: Gods Among Us and Asphalt 8  వంటి highend గేమింగ్ లో కొంచెం frame skip అయ్యాయి. అయితే ఇవి నోటీసు చేయటం అంత ఈజీ కాదు. రెగ్యులర్ usage కు ఎక్కడా లాగ్స్ కాని stutters కాని చూపించలేదు. అలాగే యాప్ లోడ్ టైమ్స్ కూడా బాగున్నాయి కాని హెవీ యాప్స్ ను ఓపెన్ చేసేటప్పుడు slight గా time పడుతుంది. అయితే ఇది నార్మల్ యాప్స్ కు హెవి యాప్స్ కు డిఫరెన్స్ ఉంది అని చెప్పటానికి కాని నిజంగా మీరు ఫోన్ తీసుకొకపోవటానికి కారణం గా ఉండదు. ప్రొసెసర్ లోని రెండు కార్టెక్స్ a53 కోర్స్ 1.5GHz మరియు 1.2Ghz పనిచేస్తాయి. ఎవరేజ్ గా 0.6GHz వద్ద రన్ అవుతుంది ఫోన్. ఇది చాలా బేసిక్ పనులకు సరిపోతుంది. advanced users కు కూడా mostly సరిపోతుంది. ప్రైస్ తో కంపేర్ చేస్తే.. complain చేయటానికి చాలా తక్కువ ఉంది ఇక్కడ.

హీటింగ్ విషయం లో కూడా బాగుంది ఫోన్. 15 నిమి గేమింగ్ చేస్తే 39.5 డిగ్రీ సెల్సియస్ కు వెళ్తుంది. FHD వీడియో రికార్డింగ్ చేస్తే 35.9 కు వెళ్ళింది 10 నిమి లకు. 40 డిగ్రీలకు మించటం లేదు ఎప్పుడూ. అంటే బాగుందనే చెప్పాలి.

బ్యాటరీ: బెస్ట్ 
extra ordinary బ్యాటరీ లైఫ్.రెడ్మి నోట్ 3 కన్నా slight గా ఎక్కువ సేపు వస్తుంది. 16 గం వచ్చింది గీక్ బెంచ్ 3 బ్యాటరీ టెస్ట్ లో. అంటే రెడ్మి నోట్ 3 కన్నా ఎక్కువ, Le 2 కు రెండు రెట్లు ఎక్కువ. గేమింగ్ చేస్తుంటే 7 గం లు స్క్రీన్ on time ఉంది. ఇదే టైమింగ్ mi మాక్స్ లో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే చాలా ఈజీగా ఒక ఫుల్ day వస్తుంది. హెవీ users కు కూడా same అని కూడా అనవచ్చు.

కెమెరా: బాగుంది
13MP రేర్ కెమెరా తో రెడ్మి 3S f/2.0 aperture కలిగి ఉంది. bright లైటింగ్ లో బాగుంది కెమెరా, లైటింగ్ తక్కువుగా ఉన్నప్పుడు నాయిస్ చూపిస్తుంది. ఇది ప్రతీ ఫోనులో ఉండేదే. అయినా ఓవర్ ఆల్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో accept చేయ దగ్గ కెమెరా పనితనం ఉంది ఫోన్.

Photos have been resized. Check the gallery below for full sized camera samples.

ఫాస్ట్ గా ఫోకస్ చేస్తుంది, కలర్స్ లో కూడా మేజర్ గా ఇంప్రూవ్ అయ్యింది రెడ్మి 2 తో పోలిస్తే. అయితే అన్ని స్మార్ట్ ఫోన్ల వలె ఇది కూడా మంచి వీడియో షూటింగ్ కు అనువుగా ఉండదు. కారణం stabilisation. అలాగే ఆడియో రికార్డింగ్ కూడా అంతగా satisfication ఉండుదు.

Xiaomi Redmi 3s

బాటం లైన్: ధరకు తగ్గ ఫోన్. వాల్యూ ఫర్ మనీ
బడ్జెట్ users కు గతంలో రెడ్మి 1S అండ్ రెడ్మి 2 రిలీజ్ అయినప్పుడు లానే ఇప్పుడు కూడా Xiaomi మంచి ఫోన్ అందించింది అని చెప్పాలి. కొన్ని విషయాలలో దీని కన్నా ఎక్కువ ధరలో ఉన్న ఫోనుల కన్నా బాగుంది. సో రెడ్మి 3S prime అండర్ 10K లో బెస్ట్ ఫోన్. 3S అండ్ 3S prime లో కేవలం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది ప్రాక్టికల్ గా. సో రెండు వేల డిఫరెన్స్ కు మీకు ఫింగర్ ప్రింట్ వద్దు అనుకుంటే 3S తీసుకోండి, లేదంటే 3S prime తీసుకోవచ్చు.

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo