Top AI Features Available on New Smartphones
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లలో కీలక భాగంగా మారింది. ఒకప్పుడు AI అంటే కేవలం కెమెరా పెర్ఫార్మెన్స్ ను మరింత మెరుగుపరచే ఫీచర్ మాత్రమే అనుకునే వారు. కానీ, ప్రస్తుతం విడుదలవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్ లలో AI ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్లేషన్, కాల్ సమరీ, వాయిస్ అసిస్టెన్స్, బ్యాటరీ, సెర్చ్ మరియు వ్యక్తిగత సూచనలు వంటి అనేక విభాగాల్లో ఉపయోగపడుతోంది. అందుకే, ఈ ఫీచర్స్ తో యూజర్లు వారి రోజువారీ పనులు చాలా వేగంగా మరియు సులభంగా పూర్తి చేయగలుగుతున్నారు.
అందుకే, Google, Samsung, Apple, Xiaomi, OPPO, vivo, HONOR వంటి కంపెనీలు తమ కొత్త ఫోన్ లలో అధునాతన AI ఫీచర్లను అందిస్తూ వినియోగదారుల అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈరోజు New Smartphone లో ఉండే టాప్ AI ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
నేటి మోడరన్ స్మార్ట్ ఫోన్ కెమెరాలు AI సహాయంతో సన్నివేశాన్ని గుర్తించి, దానికి తగినట్లుగా రంగులు, ఎక్స్‌పోజర్, HDR మరియు కాంట్రాస్ట్ వంటి అంశాలను ఆటోమేటిగ్గా సర్దుబాటు చేస్తాయి. అంతేకాదు, పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ఫుడ్, ల్యాండ్ స్కేప్ వంటి సన్నివేశాలు గుర్తించి మెరుగైన ఫోటోలు అందిస్తాయి. కొన్ని ఫోన్స్ అయితే AI Eraser లేదా AI Object Removal ద్వారా ఫోటోలో అవసరం లేని వ్యక్తులు లేదా వస్తువులు సులభంగా తొలగించే అవకాశం కూడా అందిస్తున్నాయి.
గతంలో వీడియో ఎడిటింగ్ అంటే దానికి ఎంతో అనుభవం మరియు క్రియేటివిటీ అవసరం అయ్యేది. అయితే, కొత్త ఏఐ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ లతో వీడియోలను ఎడిట్ చేయడం ఇప్పుడు చాలా సులభమైంది. AI సహాయంతో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించడం, వీడియో స్టెబిలైజేషన్, ఆటో సబ్ టైటిల్స్, బ్యాక్ గ్రౌండ్ బ్లర్ మరియు అవసరం లేని భాగాలను తొలగించడం వంటి పనులను కొన్ని ట్యాప్ లతో పూర్తి చేయవచ్చు. సోషల్ మీడియా కోసం షార్ట్ వీడియోలు తయారు చేసే వారికి ఈ ఫీచర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్ లలో ఫోటో మరియు వీడియో ఎడిటింగ్ చాలా ఈజీ గా మారింది.
భాషా అవరోధాలను (లాంగ్వేజ్ బ్యారియర్) తగ్గించేందుకు ప్రస్తుతం వస్తున్న అనేక లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు రియల్ టైమ్ అనువాదాన్ని (ట్రాన్స్లేషన్ ) ఆఫర్ చేస్తున్నాయి. మెసేజెస్, వెబ్ పేజీలు, వాయిస్ సంభాషణలు, ఫోన్ కాల్స్ ను కూడా కొన్ని ఫోన్ లు ప్రత్యక్షంగా అనువదించగలవు. విదేశీ ప్రయాణాలు లేదా ఇతర భాషలు మాట్లాడే వారితో కమ్యూనికేట్ చేయాల్సిన సందర్భాల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
లేటెస్ట్ టెక్ స్మార్ట్ ఫోన్ లలో కాల్ ముగిసిన తర్వాత సంభాషణ లోని ముఖ్యమైన అంశాలు సంక్షిప్తంగా చూపించే “AI Call Summary” ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అలాగే, వాయిస్ రికార్డింగ్ లను టెక్స్ట్‌గా మార్చడం మరియు మీటింగ్ నోట్స్ సిద్ధం చేయడం వంటి పనులు కూడా AI వేగంగా పూర్తి చేస్తుంది.
కొన్ని ఆధునిక స్మార్ట్ ఫోన్ లలో స్క్రీన్ పై కనిపించే ఏదైనా వస్తువు చిత్రం లేదా టెక్స్ట్ చుట్టూ సర్కిల్ చేస్తే, దానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే సెర్చ్ చేసే సౌకర్యం ఉంది. షాపింగ్, విద్య, ప్రయాణం లేదా సాధారణ సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ఇది చాలా వేగవంతమైన మార్గంగా మారింది.
ఈమెయిల్, మెసేజ్ లేదా సోషల్ మీడియా పోస్టులు రాయడానికి “AI Writing Assistant” చాలా ఉపయోగపడుతుంది. ఇది వ్యాకరణ దోషాలను సరిచేయడం, వాక్యాలను మరింత స్పష్టంగా మార్చడం, టోన్ ను అధికారికంగా లేదా స్నేహపూర్వకంగా మార్చడం వంటి పనులు చేస్తుంది. ఎక్కువగా టైపింగ్ చేసే వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది మరియు వారి సమయాన్ని బాగా ఆదా చేస్తుంది.
కొత్త AI ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ సహజమైన సంభాషణలను అర్థం చేసుకుని రిమైండర్ సెట్ చేయడం, సందేశాలు పంపడం, కాల్స్ చేయడం, యాప్ ఓపెన్ చేయడం, ప్రయాణ మార్గాలను చూపించడం వంటి పనులను మరింత వేగంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని ఫోన్ లలో ఇవి వినియోగదారుడి అలవాట్లను గుర్తించి వ్యక్తిగత సూచనలను కూడా అందిస్తాయి. ఇది నిజంగా స్మార్ట్ ఫోన్ కలిగిన అద్భుతమైన ఫీచర్ అని మనం నిస్సంకోచంగా చెప్పవచ్చు.
AI మీ వినియోగ అలవాట్లను విశ్లేషించి ఎక్కువగా ఉపయోగించే యాప్ లకు ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే, అవసరం లేని బ్యాక్ గ్రౌండ్ యాప్ లను నియంత్రించడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది. దీంతో ఒకే ఛార్జ్ పై ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఫోన్ పనితీరును కూడా సమతుల్యంగా ఉంచుతుంది. ఇది ఫోన్ బ్యాటరీ లైఫ్ ను మరింత పెంచుతుంది.
Also Read: Realme Narzo 100x: దృఢమైన బాడీ మరియు 8000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.!
కొత్త స్మార్ట్ ఫోన్ లలో AI ఆధారిత స్పామ్ కాల్ గుర్తింపు, ఫిషింగ్ హెచ్చరిక, అనుమానాస్పద లింకుల గుర్తింపు మరియు ఫోటోలు కలిగిన సున్నితమైన సమాచారాన్ని గుర్తించి యూజర్ ను రక్షించడం వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి వినియోగదారుల ప్రైవసీ మరియు సెక్యూరిటీ మరింత మెరుగుపరుస్తాయి.
కొత్త టెక్నాలజీ తో వచ్చే కొత్త స్మార్ట్ ఫోన్ లు కలిగిన ఏఐ ఫీచర్స్ యూజర్ పనులను సులభం చేయడమే కాకుండా మెరుగైన ఫోటోగ్రఫీ, వేగవంతమైన సెర్చ్, సులభమైన కమ్యూనికేషన్ మరియు స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ వంటి అనేక పనులు చేపడతాయి.