4GB ర్యామ్ అండ్ నాలుగు కలర్స్ లో లాంచ్ అయిన Smartron t.phone మొదటి అభిప్రాయాలు

4GB ర్యామ్ అండ్ నాలుగు కలర్స్ లో లాంచ్ అయిన Smartron t.phone మొదటి అభిప్రాయాలు

Sachin టెండూల్కర్ ఇన్వెస్ట్మెంట్ మరియు బ్రాండ్ ambassador గా ఇండియాలో Smartron అనే టాబ్లెట్ అండ్ స్మార్ట్ ఫోన్ కంపెని స్టార్ట్ అయ్యింది.

ఇది ముందు t.book ను లాంచ్ చేసింది 39,999 రూ లకు. ఇలా కొత్తగా వచ్చిన కంపెని కు ఈ ప్రైస్ ఎక్కువే, కాని ఇది మేము రివ్యూ చేయటం జరిగింది. మైక్రో సాఫ్ట్ సర్ ఫేస్ టాబ్లెట్  కు మంచి పోటీ ఇస్తుంది. అవసరం ఉన్న వారు దీనిని తిసుకోగలరు.

ఇప్పుడు t.phone లాంచ్ అయ్యింది 4GB DDR4(చాలా మంది 4GB ఇస్తున్నారు కాని DDR4 రేర్ టెక్నాలజీ ప్రస్తుతం) ర్యామ్ తో 22,999 రూ లకు. స్నాప్ డ్రాగన్ 810 SoC, 5.5 in FHD డిస్ప్లే, 13MP రేర్ కెమెరా, 3000 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, usb టైప్ C పోర్ట్.

Mi 5 లో ఉన్న స్నాప్ డ్రాగన్ 820 తో పోలిస్తే తక్కువే స్నాప్ డ్రాగన్ 810 స్పీడ్. కాని మార్ష్ మల్లో OS లోని Kernel tweaks వలన ఫోన్ కచ్చితంగా స్పీడ్ ఉంటుంది అని చెబుతుంది smartron కంపెని. అది నిజమో కాదో రివ్యూ చేస్తే తెలిసిపోతుంది కాని atleast మార్ష్ మల్లో తో వస్తుంది ఫోన్. చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ 6.0 ను ఇవ్వలేకపోతున్నాయి. full మెటల్ బాడీ తో ఆరెంజ్, పింక్, బ్లూ అండ్ గ్రే కలర్స్ లో వస్తుంది. ఫ్రెష్ గా ఉన్నాయి లుక్స్. చేతిలో పట్టుకోవటానికి బాగుంది ఫోన్. డిజైన్ బాగుంది ఓవర్ గా లేదు. నేను గడిపిన కొద్ది క్షణాలు ఫోన్ స్పీడ్ గానే ఉంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తో పాటు సొంత వెబ్ సైట్ లో కూడా సేల్స్ చేస్తుంది. అలాగే ఆఫ్ లైన్ లో కూడా సేల్స్ చేసేందుకు ప్రయత్నాలు మొదలపెట్టింది కంపెని. అయితే ఫోన్ లో కొత్తగా ఏముంది? అదీ 22,999 ప్రైస్ తో వస్తున్న ఫోన్ లో..ఇంకా ఎక్కువ ఆశిస్తాము కదా! ఏముందో తెలుసుకోవటానికి కంప్లీట్ రివ్యూ వరకు వేచి ఉండండి.

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo