Oneplus2: బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది?

Oneplus2: బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది?

చాలా తక్కువ ధరకు హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తో oneplus one అన్ని విషయాలలో బెస్ట్ ఫోన్ గా ఎక్కువ మంది యూజర్స్ ను ఆకట్టుకుంది. కాని Oneplus వన్ మోడల్ లో వాడిన స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ కారణంగా దానికి హిటింగ్ ఇష్యూ ఉండేది కొంతమంది యూజర్స్ కు. అయితే ఆ హిటింగ్ ఇష్యూ రెండవ మోడల్ oneplus 2 లో రాకుండా ఉంచటానికి కంపెని తీసుకున్న కొన్ని measures లో ఒకటి ఫాస్ట్ చార్జింగ్ ను దీనిలో జోడించకపోవటం.

మా బ్యాటరీ టెస్ట్ లలో ఫోన్ 7.1 గంటలు వచ్చింది. ఇది respectable లైఫ్ అని చెప్పాలి. ఇది మోటో టర్బో, గేలక్సీ S6, LG G4 కన్నా తక్కువ, సోని Z3+ కన్నా ఎక్కువ. Oneplus 2 ఛార్జింగ్ చేసే టప్పుడు మాత్రం హీట్ అవటం లేదు.

ఫోన్ విడుదల అయిన రోజు నుండి మేము దీనిని వాడటం జరుగుతుంది. మొదటి రోజు ఫోన్ 100 % ఛార్జింగ్ చేసినతరువాత మొదటిగా మేము వాడినది ఒక గంట సేపు హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్, సోషల్ నెట్వర్కింగ్ మరియు 4 ఫోన్ కాల్స్. ఇప్పుడు ఫోన్ 79% కు తగ్గింది.

అయితే ఎటువంటి ఫోన్ అయినా మొదటి 20% బ్యాటరీ లైఫ్ ఎప్పుడూ ఫాస్ట్ గానే అవుతుంది. దీని బట్టి బ్యాటరీ లైఫ్ ను judge చేయకూడదు. 40-80% మధ్యలో స్మార్ట్ ఫోన్ మంచి బ్యాటరీ సామర్ద్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి.

తరువాత ఫోన్ లో 25 ఇమేజెస్ ను ఫ్లాష్ లేకుండా no interruptions మోడ్ లో తీసాము. 3 కాల్స్, కొంచెం వాట్స్ అప్ యూసేజ్, text మెసేజెస్ ను చేసాము. తరువాత 1pm కు విండోస్ 10 లాంచ్ ఈవెంట్ కు వెళ్లేముందు ఫోనులో 65% ఉంది బ్యాటరీ. అక్కడికి వెళ్ళాక 63% కు డ్రాప్ అయ్యింది. 

తరువాత ఫోన్ 3 గంటలు పాటు WiFi ను వాడింది.(మొబైల్ డేటా internet కన్నా wifi లో బ్యాటరీ తక్కువ అవుతుంది). కంటిన్యుస్ గా ఫోటోలు తీసాము, ట్విటర్ లో ట్విట్స్ ను పోస్ట్ చేశాం.(Twitter లో డిజిట్ తెలుగు ను @DigitTelugu వద్ద ఫాలో అవగలరు), అలాగే 30 secs మరియు అంతకుమించి వీడియోలను షూట్ చేయటం, మెయిలింగ్, కాల్స్, నోట్స్ వంటి పనులు చేశాము. Note: reviewers గా మేము చెప్పే హెవీ యూసేజ్ అంటే ఇదే.

సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ఆఫీస్ కు అక్కడనుండి బయటకు వచ్చే సరికి ఫోన్ 26% బ్యాటరీ పర్సెంట్ తో ఉంది. తరువాత 5 నుండి 7 mins పాటు Marvel: contest of champions ఆడటం జరిగింది. ప్రయాణంలో వాట్స్ అప్, సోషల్ మీడియా బ్రౌజింగ్ చేశాము. 6.15 pm కు ఆఫీస్ కు చేరుకునే సరికి ఫోనులో 15% బ్యాటరీ తో వార్నింగ్ మేసేజ్ చూపించింది. 6.15 నుండి 7 pm వరకూ బ్యాటరీ సేవర్ ను ఆన్ చేయకుండా కొన్ని ఫోటోలను తీయటం జరిగింది. ఇప్పుడు ఫోన్ 7% కు చేరటంతో చార్జింగ్ ప్లగ్ చేశాము.

మరుసటి రోజు కొంచెం లైట్ యూసేజ్ చేశాము. కెమేరా తక్కువ వాడటం జరిగింది. సో ఫోన్లో 7pm అయ్యేసరికి 37% ఉంది బ్యాటరీ. ఫాస్ట్ గా అందరికన్నా ముందు ఇవ్వటం కోసం కాకుండా Accurate info ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. ఇప్పటికీ రెండు రోజులు అయ్యింది ఫోన్ పై ప్రయోగాలు చేసి, judge చేసే ముందు మరిన్ని టెస్ట్ లు చేయవలసి ఉంది. అయితే ఇప్పటివరకూ మంచి ఫలితాలనే ఇస్తుంది Oneplus 2 బ్యాటరీ. 

సో ఓవర్ ఆల్ గా pretty comfortable బ్యాటరీ లైఫ్ అని చెప్పవచ్చు. అయితే only dissappointment ఏంటంటే  హిటింగ్ ఇష్యూ ను tackle చేయటానికి oneplus క్విక్ చార్జ్ ఫీచర్ ను తీసివేసింది oneplus 2 లో.దీని వలన 3300 mah బ్యాటరీ ఉన్న ఫోన్ 7 గంటలకు చార్జింగ్ పెడితే 9 pm గంటలకు 96% చార్జింగ్ సమయం తీసుకుంది. అతి త్వరలో కంప్లీట్ రివ్యూ వస్తుంది. గమనిక: ఈ మొత్తం excercise లో ఫోన్ maximum brightness లో ఉంది.
 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo