How Much Should You Spend on Earbuds best Budget Buying Guide
ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. సంగీతం వినడం, ఫోన్ కాల్స్ మాట్లాడటం మొదలుకొని ఆన్ లైన్ మీటింగ్ మరియు గేమింగ్, జిమ్ వర్కౌట్స్ వంటి అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతున్నాయి. అయితే, మార్కెట్‌లో రూ. 500 నుంచి రూ. 20,000 వరకు వివిధ ధరల్లో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉండటంతో ఏ బడ్జెట్‌లో కొనాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ను దూరం చేయడానికి, ఏ బడ్స్ కి ఎంత బడ్జెట్ ఖర్చు చేయాలో వివరంగా తెలియ చేసే బెస్ట్ గైడ్ మీకోసం అందించాం.
మీ వినియోగ అవసరాలు మరియు ఫీచర్స్ ను దృష్టిలో ఉంచుకుని ఇయర్ బడ్స్ బడ్జెట్ ని సెట్ చేసుకోవాలి. మీరు కేవలం కాలింగ్ కోసం మాత్రమే బడ్స్ కోసం చూస్తుంటే ఎక్కువ మైక్ లు మరియు ANC బడ్స్ తీసుకుంటే మంచిది. అయితే, గేమింగ్ కోసం అయితే 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో మరియు లో లిటెన్సీ మోడ్ కలిగిన బడ్స్ తీసుకోవాలి. అలాగే, మూవీస్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ANC, స్పేషియల్ ఆడియో మరియు Hi Res ఆడియో సర్టిఫైడ్ కలిగిన బడ్స్ తీసుకోవడం మంచిది.
మీరు సాధారణంగా పాటలు వినడం, అప్పుడప్పుడు కాల్స్ చేయడం కోసం ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే రూ. 1,000 నుంచి రూ. 2,000 మధ్య లభించే ఇయర్ బడ్స్ మోడళ్లు సరిపోతాయి. ఈ ధరలో బ్లూటూత్ 5.3 లేదా 5.4, ENC కాలింగ్, 30–50 గంటల లాంగ్ ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. విద్యార్థులు మరియు సాధారణ వినియోగదారులకు ఈ బడ్జెట్ ఉత్తమ ఎంపిక గా చెప్పవచ్చు. అంతేకాదు, ఈ బడ్జెట్ లో ఎక్కువగా మార్కెట్ లో పోటీ ఉంది. అంటే, ఎక్కువ ఇయర్ బడ్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులో ఉన్నాయి.
మీరు రోజూ ఎక్కువ సేపు కాల్స్ మాట్లాడటం, గేమ్ ఆడటం లేదా గొప్ప రిజల్యూషన్ లో హై ఎండ్ సంగీత అనుభవం కోరుకుంటే రూ. 2,500 నుంచి రూ. 5,000 బడ్జెట్ లో ఒక మంచి ఇయర్ బడ్ కొనుగోలు చేయడం మంచిది. ఈ విభాగంలో యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC), Hi-Res Audio, LDAC కోడెక్ సపోర్ట్, మల్టీ పాయింట్ కనెక్టివిటీ మరియు లో లేటెన్సీ గేమింగ్ మోడ్ వంటి ఆడియో ఫీచర్స్ తో పాటు మెరుగైన మైక్రోఫోన్ నాణ్యత వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. అంటే, ఈ రేంజ్ బడ్స్ లో గొప్ప మ్యూజిక్ తో పాటు క్వాలిటీ కాలింగ్ ను కూడా ఆస్వాదించవచ్చు.
Also Read: రేపు లాంచ్ కాబోయే Samsung Galaxy M47 5G ఫోన్ పూర్తి ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి.!
రూ. 5,000 కంటే ఎక్కువ ధర ఉన్న ఇయర్ బడ్స్ ప్రధానంగా ప్రీమియం వినియోగదారులు, ప్రొఫెషనల్ మరియు అత్యుత్తమ ఆడియో నాణ్యత కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసే ముందు బ్యాటరీ బ్యాకప్, డ్రైవర్ సైజు, కాల్ క్వాలిటీ, IPX వాటర్ రెసిస్టెన్స్, వారంటీ, బ్రాండ్ సర్వీస్ మరియు యూజర్ రివ్యూ లను తప్పనిసరిగా పరిశీలించాలి. అవసరానికి మించిన ఫీచర్ల కోసం అధిక మొత్తాన్ని ఖర్చు చేయకుండా, మీ వినియోగానికి సరిపోయే బడ్జెట్ ను ఎంచుకోవడం ద్వారా తక్కువ ధరలోనే ఉత్తమ ఇయర్ బడ్స్ ను పొందవచ్చు.