ఆపిల్ లేటెస్ట్ iOS వెర్షన్ 10 ఒక గజిబిజి. ఎందుకో చదవండి..

ఆపిల్ లేటెస్ట్ iOS వెర్షన్ 10 ఒక గజిబిజి. ఎందుకో చదవండి..

ఆపిల్ ఫోన్లకు iOS 10 కొత్త వెర్షన్ రిలీజ్ అయ్యింది. అయితే పబ్లిక్ కి రిలీజ్ చేసినప్పటికీ దానిని డైరెక్ట్ గా OTA ద్వారా కాకుండా డెవలపర్స్ మోడ్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు అందరూ free గా.

ప్రధానంగా pre installed యాప్స్ ను uninstall చేసుకునే సదుపాయం ఇస్తుంది. కాని తొందరపడకండి iOS 10 అస్సలు అర్దవంతంగా లేదు. ఎందుకో చూడండి ఇక్కడ..

లాక్ స్క్రీన్
ప్లస్ – లాక్ స్క్రీన్ లో నోటిఫికేషన్స్ తో పాటు widgets యాడ్ చేసింది.  texts కు రిప్లై ఇవగలరు అక్కడకక్కడే.
మైనస్ – కాని వీటికి privacy లేదు. ఎవరైనా చూడగలరు, చదవగలరు మీ ప్రైవేటు ఇన్ఫర్మేషన్.  ఇప్పుడు నోటిఫికేషన్ పై స్వైప్ చేస్తే వచ్చే ఆప్షన్స్ లో లిమిటేషన్స్. అలాగే చాలా ఎక్కువ స్పేస్ కేటాయించారు నోటిఫికేషన్ డిజైన్ కు. ఇన్ఫర్మేషన్ తక్కువ స్పేస్ ఎక్కువ.

  

ఆపిల్ మ్యూజిక్ – ఆపిల్ ఇంతవరకూ తయారు చేసిన వాటిలో వరస్ట్ యాప్ ఇదే.
iOS 10 లో దీనిలో కొన్ని మార్పులు చేసి, టోటల్ యాప్ పైనే చెడు అభిప్రాయాన్ని తీసుకువచ్చింది ఆపిల్ బృందం.  పెద్ద పెద్ద బోల్డ్ డిజైన్లు, confusing గా ఉండే UI అండ్ texts. కేవలం ఎదో మార్చాలి కదా అని మార్చినట్లే ఉంటుంది.

  

ఏదైనా సాంగ్ like లేదా డౌన్లోడ్ చేయలన్నా, ఎక్కువ టాప్స్ ను వాడాలి. అలాగే ఒక సాంగ్ ను ప్లే చేస్తేనే దానిని ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయగలరు. ప్లే చేయకుండా డౌన్లోడ్ అవ్వదు.

కంట్రోల్ సెంటర్
ఇది బాగా ఫెమస్ ఆపిల్ లో. షార్ట్ కట్స్ ను ఆండ్రాయిడ్ లా కాకుండా క్రింద నుండి ఒక swipe ద్వారా అందిస్తుంది కంట్రోల్ సెంటర్. కేవలం Night Shift ఫీచర్ ఒక్క దాని కోసం పెద్ద బటన్ యాడ్ చేసింది. మ్యూజిక్ కంట్రోల్స్ కొరకు రెండవ swipe చేయాలి పక్కకు. అస్సలు ఉపయోగకరంగా లేదు డిజైన్.

మిగిలిన ఇష్యూస్
spotlight సర్చ్ స్క్రీన్ same widgets మెనూ స్క్రీన్ లానే ఉంటుంది. అంటే రిపీట్ చేసినట్లే. ఇదే స్క్రీన్ నోటిఫికేషన్స్ డ్రాప్ menu ను సైడ్ కు స్వైప్ చేసినా వస్తుంది.. ఏదో ఫోర్స్ గా మనల్ని widgets వాడమని చెబుతున్నట్లే ఉంది.

అలాగే కొత్త text messaging అని చెబుతుంది. అసలు ఇండియాలో సాధారణ text messaging ఎవరు వాడుతున్నారు ఇప్పుడు. iOS 10 లో ఇమేజెస్, మ్యూజిక్ వంటి ఆప్షన్స్ యాడ్ అయ్యాయి దీనికి. కాని అందరూ ఇంటర్నెట్ బేస్డ్ వాట్స్ మేసేంజర్స్ ఎక్కువ వాడటం జరుగుతుంది కదా.

ఫైనల్ లైన్ – ప్రతీ చోటా ios 10 లో అన్నీ డిజైన్స్ పెద్దగా మార్చింది. కాని దీని వలన ప్రతీ చోటా ఇన్ఫర్మేషన్ చిన్నగా అయిపోయి, కొన్ని చోట్ల మిస్ అయ్యింది కూడా. చిన్న స్క్రీన్ ఫోనుల పై మంచి ఫీలింగ్ కనిపించలేదు,  కేవలం ipad వంటి పెద్ద డివైజ్ లేక్ iOS నచ్చే అవకాశాలున్నాయి.

 

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo