సైబర్ మోసాలు: తాజా Cybersecurity స్కామ్స్‌ పై అప్రమత్తంగా ఉండండి.!

HIGHLIGHTS

ఆన్‌ లైన్ బ్యాంకింగ్ మరియు UPI పెమెంట్స్ మన జీవితంలో ఒక భాగమై పోయాయి

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసం చేసే పద్ధతులు కూడా మరింత అధునాతనంగా మారుతున్నాయి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు

సైబర్ మోసాలు: తాజా Cybersecurity స్కామ్స్‌ పై అప్రమత్తంగా ఉండండి.!

ప్రస్తుతం డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్స్, ఆన్‌ లైన్ బ్యాంకింగ్ మరియు UPI పెమెంట్స్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసం చేసే పద్ధతులు కూడా మరింత అధునాతనంగా మారుతున్నాయి. బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఉద్యోగాలు మరియు AI టెక్నాలజీ పేరుతో ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా Cybersecurity స్కామ్స్‌ పై అప్రమత్తంగా ఉండండం చాలా అవసరం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

AI వాయిస్ మరియు వీడియో స్కామ్స్

టెక్ స్కామ్స్ లో ముందు వరుసలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో చేసే వాయిస్ అండ్ వీడియో స్కామ్. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు సన్నిహితుల గొంతును, వీడియోలను నకిలీగా రూపొందిస్తున్నారు. ఈ టెక్ తో సదరు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుడిలా మాట్లాడి అత్యవసరంగా డబ్బు పంపాలని కోరే ఘటనలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రముఖుల వీడియోలను సైతం మార్ఫింగ్ చేసి పెట్టుబడుల పేరుతో మోసాలు కూడా చేస్తున్నారు.

UPI మరియు QR కోడ్ స్కామ్స్

గతంలో భారీగా జరిగిన QR కోడ్ స్కామ్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. డబ్బు పంపించాల్సిన సందర్భంలో “ఈ QR కోడ్ స్కాన్ చేయండి” అంటూ మోసగాళ్లు మెసేజ్ పంపిస్తారు. ఈ కోడ్‌ లను స్కాన్ చేస్తే మీ ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా డబ్బు రిసీవ్ అవ్వదు, కేవలం డబ్బు ట్రాన్స్ఫర్ మాత్రమే అవుతుంది.

KYC అప్‌డేట్ పేరుతో మోసాలు

ఇది దశాబ్ద కాలంగా వాడుకలో ఉన్న స్కామ్ అని చెప్పొచ్చు. “మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది” లేదా “KYC వెంటనే అప్‌డేట్ చేయండి” వంటి SMS లు లేదా వాట్సాప్ సందేశాలు పంపి నకిలీ వెబ్‌ సైట్ల కు మళ్లించి మోసం చేస్తారు. KYC అప్డేట్ పేరుతో ఇచ్చే అప్లికేషన్ లో బ్యాంక్ వివరాలు, OTP లు నమోదు చేస్తే ఖాతాల్లో ఉన్న డబ్బు క్షణాల్లో ఖాళీ అవుతుంది.

జాబ్స్ మరియు పార్ట్‌ టైమ్ జాబ్స్ పేరుతో మోసాలు

ఈ మధ్య కాలంలో జాబ్స్ మరియు పార్ట్‌ టైమ్ జాబ్స్ పేరుతో మోసాలు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంట్లో కూర్చొని రోజుకు వేల రూపాయలు సంపాదించండి, అంటూ వచ్చే తప్పుడు ప్రకటనలు నమ్మితే నిలువునా ముంచేస్తారు. ఇలాంటి మెసేజ్ లను WhatsApp మరియు Telegram లో ఉండే గ్రూపుల ద్వారా ఎక్కువగా అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం కలిగించి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయమని కోరతారు. ఇది నిజమని నమ్మితే మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదం ఉంది.

సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్

Instagram, Facebook మరియు WhatsApp అకౌంట్ లను టార్గెట్ చేస్తూ ఫిషింగ్ లింకులు పంపుతున్నారు. ఒకసారి అకౌంట్ హ్యాక్ అయితే, మీ కాంటాక్ట్ లో ఉండే వారిని మీ పేరు మరియు అకౌంట్ తో డబ్బు అడిగే సందేశాలు పంపే ప్రమాదం ఉంది.

latest Cybersecurity scams and warnings

దేశంలో జరుగుతున్నా ఆన్లైన్ మరియు సైబర్ మోసాల గురించి క్లుప్తంగా చెప్పారు బాగానే ఉంది, మరి ఈ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో లేదా ఎలా రక్షించుకోవాలో కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. మీకు సహాయం గా కొన్ని వివరాలు అందిస్తున్నాము.

సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి?

  • OTP, PIN, CVV వంటి వివరాలు ఎవరికీ చెప్పొద్దు.
  • తెలియని లింక్ లపై క్లిక్ చేయవద్దు.
  • బ్యాంక్ లేదా ప్రభుత్వ సంస్థ పేరుతో వచ్చిన సందేశాలను అధికారిక వెబ్‌ సైట్‌ లో మాత్రమే ధృవీకరించండి.
  • రెండు దశల భద్రత (Two-Factor Authentication) తప్పనిసరిగా ఉపయోగించండి.
  • యాప్‌ లను అధికారిక యాప్ స్టోర్ల నుంచే డౌన్‌ లోడ్ చేయండి.
  • అనుమానాస్పద కాల్స్, మెసేజ్ వస్తే వెంటనే బ్లాక్ చేయండి.

ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోకుండా ఒకొక్కసారి మోసపోయే అవకాశం ఉంటుంది. మరి అటువంటి సందర్భాల్లో ఏం చేయాలో కూడా చెబుతాను.

Also Read: GOAT Sale కంటే ముందే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై గ్రేట్ డీల్ రివీల్ చేసిన Flipkart

మోసానికి గురైతే ఏం చేయాలి?

సైబర్ మోసానికి గురైన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌ లైన్ 1930 కు కాల్ చేయాలి. అలాగే National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా డబ్బు రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ నవీన యుగంలో AI, UPI, సోషల్ మీడియా మరియు ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల నుంచి రక్షణ పొందాలంటే అప్రమత్తతే ప్రధాన ఆయుధం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile